https://oktelugu.com/

Ukraine Crisis: 300 మంది బలి: రష్యా పంతం.. ఉక్రెయిన్ పట్టుదల.. మధ్యలో ప్రజలే సమిధలు!

Ukraine Crisis: తప్పు ఎవరిది అయినా.. మధ్యలో బలైపోతున్నది మాత్రం పాపం ప్రజలే. నాటో, అమెరికా కూటమికి దగ్గరై తన పక్కలో బల్లెంలా తయారైన ఉక్రెయిన్ పై దండెత్తిన రష్యా.. ఎంతకూ లొంగిపోని ఆదేశంపైకి ఇప్పుడు క్షిపణుల వర్షం కురిపిస్తోంది. ఈ దాడిలో అమాయక ప్రజలు చనిపోతున్నారు. రష్యా సేనలు భీకర దాడులతో విరుచుకుపడుతుండడంతో ఉక్రెయిన్ లో మరణ మృదంగం వినిపిస్తోంది. కీవ్, ఖర్కివ్, మరియుపోల్ వంటి నగరాలపై రష్యా క్షిపణులు, బాంబు దాడులతో బెంబేలెత్తిస్తోంది. ఇన్నాళ్లు […]

Written By:
  • NARESH
  • , Updated On : March 25, 2022 / 06:14 PM IST
    Follow us on

    Ukraine Crisis: తప్పు ఎవరిది అయినా.. మధ్యలో బలైపోతున్నది మాత్రం పాపం ప్రజలే. నాటో, అమెరికా కూటమికి దగ్గరై తన పక్కలో బల్లెంలా తయారైన ఉక్రెయిన్ పై దండెత్తిన రష్యా.. ఎంతకూ లొంగిపోని ఆదేశంపైకి ఇప్పుడు క్షిపణుల వర్షం కురిపిస్తోంది. ఈ దాడిలో అమాయక ప్రజలు చనిపోతున్నారు. రష్యా సేనలు భీకర దాడులతో విరుచుకుపడుతుండడంతో ఉక్రెయిన్ లో మరణ మృదంగం వినిపిస్తోంది.

    Ukraine Crisis

    కీవ్, ఖర్కివ్, మరియుపోల్ వంటి నగరాలపై రష్యా క్షిపణులు, బాంబు దాడులతో బెంబేలెత్తిస్తోంది. ఇన్నాళ్లు ప్రజలను ముట్టుకోకుండా సైన్యాన్ని, అక్కడి ప్రభుత్వంపై, కీలక స్థావరాలపైనే దాడి చేసిన రష్యా ఇప్పుడు రూటు మార్చింది. యూరప్, అమెరికా ప్రోత్సాహంతో రెచ్చిపోతున్న ఉక్రెయిన్ పై ముప్పేట దాడికి దిగుతోంది. ఎంతకూ లొంగని ఉక్రెయిన్ తీరుతో రష్యా పెద్ద ఎత్తున క్షిపణలు, బాంబులు సందిస్తోంది.

    ఈ క్రమంలోనే మరియుపోల్ లోని ఓ థియేటర్ పై బాంబు వేసింది రష్యా. అందులో ఉన్న 300 మంది మరణానికి కారణమైంది. ఈ విషయం తెలిసి ప్రపంచమే నివ్వెరపోయింది. పౌరసమాజాన్ని ముట్టుకోనని అన్న రష్యా సేనలు ఇప్పుడు అక్కడి పౌరుల ప్రాణాలకే రక్షణ లేకుండా చేస్తున్న వైనం అందరినీ షాక్ కు గురిచేస్తోంది.

    Also Read: Amit shah vs Prashant Kishor: అమిత్ షా, పీకే వ్యూహాలకు గుజరాత్ వేదిక కానుందా?

    ఉక్రెయిన్ దేశానికి వ్యూహాత్మక ఓడరేవు ‘మరియుపోల్’. ఇక్కడ వందల మంది యుద్ధ భయానికి థియేటర్ లో ఆశ్రయం పొందుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా రష్యా జరిపిన బాంబు దాడిలో ఈ థియేటర్ లోని 300 మంది మృతిచెందారని అధికారులు తెలిపారు. మరియుపోల్ లోని ఓ డ్రామా థియేటర్ పై దాడిలో పెద్ద సంఖ్యలో మరణాలు సంభవించాయని తెలిపింది.

    నెలరోజులుగా ఉక్రెయిన్ పై రష్యా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఉక్రెయిన్ ఎంతకూ లొంగకుండా మొండిగా పోరాడుతోంది. అమెరికా, నాటోదళాలు ఉక్రెయిన్ కు సహకరిస్తున్నాయి. ఈ యుద్ధ భయానికి లక్షలాది మంది ప్రజలు.. తాగునీరు, ఆహారం దొరక్క ఆకలితో అలమటిస్తున్నారు. చిన్నారులు, మహిళల పరిస్థితి దయనీయంగా మారింది. చాలా మంది చనిపోతున్న పరిస్థితి నెలకొంది.

    ఇక ఈ యుద్ధంలో రష్యా కూడా సాధించింది ఏం లేదు. ఇప్పటివరకూ 16వేల వరకూ సైనికులను కోల్పోయింది. ఇక 561 యుద్ధ ట్యాంకులు, 1625 సాయుధ శకటాలు, 115 యుద్ధ విమానాలు, 125 హెలిక్యాపర్లు నాశనం అయ్యాయి.

    Also Read: Nagendra Babu: అది న్యూసెన్స్ సైట్‌.. ఫేమ‌స్ వెబ్ సైట్ మీద నాగ‌బాబు ఆగ్ర‌హం.. ఏమైందంటే..?

    Tags