Student Rape: స్నేహాన్ని అడ్డుపెట్టుకుని ఓ యువతి పన్నాగం పన్నింది. మిత్రురాలు (Friend) జీవితాన్ని సర్వనాశనం చేసింది. నమ్మినందుకు తన శీలాన్నిపోగొట్టుకుంది. మోసాన్ని కనిపెట్టని ఆమె మోసానికి గురైందని తెలుసుకుని కన్నీరుమున్నీరుగా విలపించింది. జరిగిన దారుణానికి తగిన మూల్యం చెల్లించుకుంది. స్నేహితులని భావించి వారితో వెళ్లినందుకు కూల్ డ్రింక్ లో మత్తు మందు కలిపి ఇఛ్చి తోటి స్నేహితులతో కలిసి అత్యాచారం (Rape) చేయించింది. ఇంకా తన సెల్ లో ఆ దృశ్యాలను చిత్రీకరించింది.
స్నేహితులంటే ఒకరిపై ఒకరికి నమ్మకం ఉంటుంది. కాని నమ్మకాన్ని వమ్ము చేసింది. మధ్యప్రదేశ్ (Madhya Pradesh) లోని భోపాల్ కు చెందిన ఓ విద్యార్థిని తోటి విద్యార్థుల చేతిలో మోసపోయింది. ముగ్గురు స్నేహితులను నమ్మినందుకు ఆమె భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి వచ్చింది. బాధితురాలి ఇంటికి తన స్నేహితులైన పూజా, ఆశిష్, నిపుల్, పునీత్ లతో కలిసి ఆగస్టు 23న వచ్చారు. దీంతో పూజా తామ సమీపంలోని మండువాకు వెళ్తున్నాం. తోడుగా రావాలని పిలిచారు. దీనికి సరే అన్న బాధితురాలి స్నేహితుల్లో ఒకరైన ఆశిష్ తీసుకున్న అద్దె ఇంటికి తీసుకెళ్లారు.
అనంతరం బాధితురాలికి మత్తు మందు కలిపిన శీతల పానీయం ఇచ్చారు. అనంతరం ముగ్గురు విద్యార్థులు ఆమెపై అత్యాచారం చేశారు. అడ్డుకోవాల్సిన స్నేహితురాలు వారించకుండా వీడియో తీసింది. బాధితురాలిని కొట్టడంతో పాటు చెప్పినట్లు చేయాలని బెదిరించారు. దీంతో కేసు నమోదు చేసుకుని రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
నమ్మినందుకే మోసం చేసింది. స్నేహితురాలని భావిస్తే తన స్నేహితులతోనే ఆమెపై అఘాయిత్యానికి ఒడిగట్టింది. విశ్వాసం అనే మాటకు విలువ లేకుండా చేసింది. దీంతో ఎవరిని నమ్మాలో కూడా తెలియడం లేదు. ఇన్నాళ్లు కలిసి తిరిగిన ఆమెపై కనీసం జాలి కూడా లేకుండా అత్యాచారం చేసేందుకు వారిని ఉసిగొల్పి మరీ దారుణం చేయించడంతో అందరు కంగుతిన్నారు. సంచలనం సృష్టించిన సంఘటనపై పలు ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నాయి. బాధితురాలిపై దాడి చేసి మరీ అత్యాచారం చేసినట్లు తెలుస్తోంది.