Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆంధ్రాలోని వైఎస్ఆర్సిపి ఆగడాలను ప్రశ్నిస్తున్నారు. అధికార పార్టీ చేస్తున్న అక్రమాలను నిలదీస్తున్నారు. గుండె ధైర్యం, మెండుగా ఉండే పవన్ కళ్యాణ్.. దేన్నైనా ఎదిరించగలరు. 2014 లో టిడిపికి మద్దతు ఇచ్చినప్పటికీ రాజధాని రైతుల సమస్యలపై పోరాడారు. ఆయన పోరాటం వల్లే రైతులకు న్యాయం జరిగింది. ఉద్దానం కిడ్నీ బాధితుల పక్షాన పోరాటాలు చేయడంతో వారు నేడు స్వచ్ఛమైన నీటిని తాగుతున్నారు. కాకినాడ ఆక్వా రైతుల పక్షాన ఉద్యమాలు చేయడంతో వారి సమస్యలు పరిష్కారమయ్యాయి. ఇలా చెప్పుకుంటూ పోవాలి గాని జనసేనాని ప్రజల పక్షాన నిలబడి చేసిన పోరాటాలు ఎన్నో.. సాధించిన విజయాలు కూడా ఎన్నో. అలాంటి ప్రజా పక్షపాతి హత్యకు అధికార పార్టీ కుట్రపన్నిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గడిచిన రెండు మూడు రోజులుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హత్యకు కుట్ర జరుగుతోందని, ఆయనను చంపేందుకు రెక్కీ నిర్వహిస్తున్నట్టు జనసేన అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. అంతేకాదు ఆ పార్టీ చంద్ర ముఖ్య నేత నాదెండ్ల మనోహర్ సైతం ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. అయితే రెక్కీ పై అధికార పార్టీ చెందిన మీడియా సంస్థలు వస్తున్న వార్తల గురించి తెలిసిందే. ఇది కేవలం అల్లరిముకల పని అని జగన్ మీడియా కొట్టిపారేస్తోంది.

జరుగుతున్నది ఇది
ఇది ఇలా ఉండగా తెలుగుదేశం పార్టీ ఫైర్ బ్రాండ్ బోండా ఉమా తాజాగా మీడియా ముందుకు వచ్చారు. సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ ను హత్య చేసేందుకు 250 కోట్ల సఫారీ ఇచ్చారని, భాగంగానే హైదరాబాదులోని ఆయన నివాసం వద్ద రెక్కీ నిర్వహించారని ఆరోపించారు. బోండా ఉమా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఒకవేళ బోండా ఉమా మాటలు నిజమైతే ఆయన వద్ద ఉన్న సమాచారం ఏమిటి? దానికి బాధ్యులు ఎవరు అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశమైంది. పవన్ కళ్యాణ్ హత్యకు కుట్ర జరుగుతోంది అనే విషయంపై ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పందించలేదు.. పైగా జగన్ ప్రభుత్వం, పోలీసులు ఈ విషయాన్ని ఎందుకు సుమోటోగా తీసుకోవడం లేదు అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇక బోండా ఉమా చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ నివాసం ఉన్నది హైదరాబాదులో. ఈ విషయంపై తెలంగాణ పోలీసులు మరింత ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంటుంది.. ఇక పలు సందర్భాల్లో పవన్ కళ్యాణ్ తనకు మంచి మిత్రుడు అని చెప్పిన కేటీఆర్… హైదరాబాదులో ఆయన నివాసం పరిసర ప్రాంతాల్లో జరిగిన ఎందుకు విచారణకు ఆదేశించలేదని వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. ఏపీ ప్రభుత్వానికి ఎలాగూ సోయి లేదు. కనీసం తెలంగాణ ప్రభుత్వమైనా ఈ విషయంపై సీరియస్గా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది..
ఇప్పటం వాసులను ఏడిపిస్తున్నారు
జనసేన సమావేశానికి స్థలాలు ఇచ్చిన ఇప్పటం గ్రామస్తులపై అధికార పార్టీ చేస్తున్న దమనకాండ ప్రపంచమంతా చూస్తూనే ఉంది. రాష్ట్ర రాజధానిలో రోడ్డు నిర్మించేందుకు ముందుకు రాని ప్రభుత్వం… ఇప్పటం అనే గ్రామంలో 100 అడుగుల వెడల్పుతో రోడ్డు నిర్మించాల్సిన అవసరం ఏముందో జగన్ కే తెలియాలి. కేవలం జనసేన సమావేశానికి స్థలం ఇచ్చారనే అక్కసుతో 100 ఫీట్ల రోడ్డును నిర్మిస్తామని సాకుగా చూపి అక్కడి ప్రజల ఇళ్లను నేలమట్టం చేస్తున్నారు. ఇవ్వాళ జగన్ ప్రభుత్వం అధికారంలో ఉండొచ్చు. కానీ ప్రజలు అనేది శాశ్వతం. ఒకసారి వారు కనుక తిరగబడితే తాడేపల్లి ప్యాలెస్ లు, ఇడుపులపాయ కోటలు, బెంగళూరు శ్వేత సౌధాలు ఏవీ ఉండవు. నియంతలనే తరిమికొట్టిన చరిత్ర తెలుగు వాళ్ళది. వాళ్లకు జగన్ ఒక లెక్కా.