ప్రేమ గుడ్డిది అంటారు. ఇది అక్షరాలా నిజమే. కొందరిని చూస్తే ఇది వాస్తవమే అనిపిస్తుంది. లోకంలో జరిగే కొన్ని సంఘటనలు చూస్తే వింత అనిపిస్తుంది. అదేదో తెలుగు సినిమాలో డైలాగులా నా కళ్లతో చూస్తే తెలుస్తుంది అంటుంటారు. దీనికి తాజా ఉదాహరణ బీహార్ లో చోటుచేసుకుంది. 21 ఏళ్ల యువకుడు 41 ఏళ్ల మహిళను వివాహం(Marriage) చేసుకుని కొత్త చరిత్రకకు శ్రీకారం చుట్టాడు. ఆ మహిళకు నలుగురు పిల్లలున్నారు. భర్త కూడా గతంలో చనిపోయాడు. కానీ ఆ యువకుడు మాత్రం తనను ఇష్టపడి పెళ్లి చేసుకున్నట్లు తెలపడంతో అందరు ఆశ్చర్యపోతున్నారు.
బీహార్ లోని ఖగడియా జిల్లా దరియాపుర్ పంచాయతీ పరిధి నయాగావ్ కు చెందిన ఓ మహిళకు 41 ఏళ్లు. ఆమెకు నలుగురు పిల్లలున్నారు. భర్త కొద్ది కాలం క్రితం మృతి చెందాడు. కాగా జొరావర్ పుర్ కు చెందిన 21 ఏళ్ల రవికుమార్ అనే యువకుడితో ఆమెకు పరిచయం ఏర్పడింది. రెండేళ్లుగా వారు ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో ఆ మహిళ ఇంటికి రవికుమార్ తరచుగా వస్తూ ఉంటాడు. ఇది గమనించిన స్థానికులు ఈ వ్యవహారం ఏదో తేడాగా ఉందే అంటూ అనుమానించారు. చివరకు వారనుకున్నదే నిజం అయింది.
ఈ నేపథ్యంలో ఓ రోజు రవికుమార్ ఆ మహిళ ఇంట్లో ఉండడంతో స్థానికులు పట్టుకుని నిలదీశారు. యువకుడి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి రప్పించారు. దరియాపుర్ సర్పంచ్ శంబుసింగ్, జొరాన్ పుర్ సర్పంచ్ పంకజ్ షా ఆ మహిళ ఇంటికి చేరుకుని గ్రామస్తులు, కుటుంబ సభ్యులు కలిసి పెళ్లి జరిపించారు. నలుగురు పిల్లల్లో ఇద్దరు తల్లి దగ్గర, ఇద్దరు మహిళ తల్లి వద్ద ఉండేలా ఒప్పందం జరిగింది. ఈ వివాహం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.