Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏపీ రాజకీయాల్లో తన దూకుడును పెంచుతున్నారు. 2024 ఎన్నికలే లక్ష్యంగా పవర్ స్టార్.. తనదైన స్టైల్ లో ముందుకు సాగుతున్నారు. 2019 ఎన్నికల తరువాత కొంత సైలెంట్ మూడ్ లోకి వెళ్లిన పవన్ కల్యాణ్ కొన్నాళ్లుగా తన పార్టీపై పట్టును పెంచుతున్నారు. జన సైనికులను ఏకం చేస్తూ.. జనసేన పవర్ చూపించాలని కార్యకర్తలకు హితబోధ చేస్తున్నారు. గెలిచినా.. ఓడినా ప్రజల మనిషిగా.. ప్రజల పార్టీగా చరిత్రలో నిలిచిపోవాలని.. ప్రజల సమస్యలపై నిరంతర పోరాటం చేయాలని కార్యకర్తలకు హితబోధ చేస్తున్న పవన్ కల్యాణ్.. తన పార్టీ సైనికులనే కాకుండా ఏపీ మేథావులనందరినీ ఏకం చేస్తున్నారు. ప్రజా సమస్యలపై.. రౌండ్ టేబుల్ సమావేశాలకు సైతం సిద్ధం అవుతున్నారు. అందరినీ ఏకం చేసి .. వైసీపీ ప్రభుత్వంపై ఎదురుదాడికి దిగేందుకు ప్రణాళిక రచిస్తున్నారు.

పవన్ కల్యాణ్ వ్యూహం ఎవరికీ అర్థం కాదు. ఎప్పుడు ఎలా ప్రభుత్వంపై ఎదురుదాడికి దిగుతారా అని.. అయోమయంలో ఉంటారు. ఇటీవల కాలంలో ఏపీలో పర్యటించిన పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో సర్కారు చేస్తున్న అభివృద్ధి ఏంటని నడిరోడ్డుపై నిలదీశారు. ప్రభుత్వాన్ని బురదతో పోలుస్తూ.. స్వచ్ఛభారత్ కార్యక్రమం నిర్వహించారు. అదే క్రమంలో ప్రభుత్వం ఒకే వర్గానికి పెద్దపీఠ వేస్తోందని.. మిగితా కులాల వారు ఏపీలో లేరా అని ప్రశ్నంచారు. ఒకే కులం వారు అన్ని రంగాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారని.. మిగితా ప్రజలు కూలీలుగా.. వారి కింద పనిచేసేవారిగా మాత్రమే ఉంటున్నారని చెప్పుకొచ్చారు. ఏపీలో మార్పు తప్పనిసరి కావాలని కోరుకుంటున్నామని ఇందుకు జనసేన నిరంతరం కష్టపడుతుందని ప్రజలకు సూచించారు. ఆ తరువాత ఏర్పాటు చేసిన పలు సమావేశాల్లోనూ పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
ఏపీ ఆర్థిక పరిస్థితి రోజురోజుకు దిగజారి పోతోందని ఆందోళన చెందుతున్న పవన్ కల్యాణ్ నిధులు రాబట్టడంలో ఏపీ వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తున్నారు. ఏపీ ఆర్థిక పరిస్థితిపై వరుస ట్విట్లు చేసుకుంటూ వస్తున్నారు. ఏపీలో ఆరులక్షల కోట్లకు పైగా అప్పులు యాబైకోట్లకు పైగా బకాయిలు పెరిగిపోయాయని.. ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెడుతున్నారని ఆరోపించారు. ఈ దుస్థితికి కారణం ఏంటని పవన్ కల్యాణ్ ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో ఏపీకి చెందిన మేధావులతో సమావేశం కావాలని పవన్ కల్యాణ్ అనుకుంటున్నారు. ప్రముఖులతో చర్చించి ఏపీ పాలనను గాడిన పెట్టేలా చూడాలని… ఇందుకు మేధావుల సలహా అవసరమని.. చెప్పుకొస్తున్న పవన్ అదే దిశగా ముందుకు సాగుతున్నారు. పవన్ కల్యాణ్ ఇదే దూకుడును మరో రెండేళ్ల పాటు కొనసాగిస్తూ.. ప్రజల్లో కలిసిపోతే.. వచ్చే ఎన్నికల వరకు పార్టీని పటిష్టం చేసుకోవచ్చని జనసైనికులు చెబుతున్నారు. గత ఎన్నికల ఒక్కసీటుతో సరిపెట్టుకున్నా… ప్రస్తుతం మిగితా పార్టీల కన్నా మెరుగైన ఫలితాలు రాబట్టవచ్చని అంటున్నారు. ఈ క్రమంలో పవన్ కల్యాణ్ దూకుడు పార్టీకి మంచి మైలేజీగా ఉపయోగపడుతుందని అంతా భావిస్తున్నారు.