Samantha టాలీవుడ్ మోస్ట్ లవబుల్ కపుల్ అక్కినేని నాగచైతన్య – సమంత. ” ఏమాయ చేసావే ” సినిమాతో వెండి తెరకు పరిచయమైన సామ్ , ఆ తర్వాత వారి స్నేహం ప్రేమగా మారి …. 2017 లో పెద్దలను ఒప్పించుకుని వివాహం చేసుకుని ఒకటయ్యారు. వివాహం జరిగి నాలుగు సంవత్సరాలు గడుస్తున్న నేపధ్యంలో అనూహ్యంగా తాము విడాకులు తీసుకుంటున్నట్లు సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించి … అభిమానులతో పాటు సినీ ఇండస్ట్రీ వారికి సైతం షాకిచ్చారు.

దీంతో ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ దంపతులు… ఆకస్మాత్తుగా విడాకులు తీసుకోవడానికి గల కారణాలు ఏంటీ అని తెలుసుకునేందుకు అందరూ ప్రయత్నిస్తున్నారు. అలానే వీరి విడాకుల గురించి స్పందిస్తూ ట్వీట్ చేసిన నాగార్జున కూడా అది భార్య , భర్తల మధ్య విషయం అని చెప్పారు. ఇక నెట్టింట్లో వారు విడిపోవడానికి ఇదే కారణం అంటూ… ఎవరికి నచ్చినట్లుగా వారు సమంత గురించి అసభ్యంగా పోస్ట్ లు పెడుతూ ట్రోల్స్ చేయడం గమనించవచ్చు. అయితే సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని… అలాంటి వార్తలు ప్రచారం చేస్తే… తాను ఊరుకోనoటూ హెచ్చరించింది సమంత.
ఇది ఇలా ఉండగా తాజాగా… సమంత పర్సనల్ స్టైలిస్ట్ ప్రీతమ్ జుకల్కర్ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చాడు. సమంతకు తనకు మధ్య బంధం గురించి… అక్కినేని నాగ చైతన్య కు బాగా తెలుసు అని చెప్పిన ప్రీతమ్… సమంతను తాను ఎప్పుడూ సిస్టర్ అని పిలుస్తానని చెప్పుకొచ్చాడు. కానీ కొంతమంది కావాలనే తమ మధ్య ఎఫైర్ ఉన్నట్లు వార్తలు రాస్తున్నారని బాధపడ్డాడు ప్రీతమ్. ఈ మేరకు తన ఇంస్టాగ్రామ్ వేదికగా ఓ పోస్ట్ చేసి ఎమోషనల్ అయ్యాడు జుకాల్కర్.
