Chandrababu: రాష్ట్రంలోనే కాదు దేశంలోనే సీనియర్ రాజకీయ నేతల్లో ఒకరు ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు. కాగా, ఆయనకు 2021వ సంవత్సరం వెరీ బ్యాడ్ ఇయర్‌గా ఉండిపోయిందని పలువురు రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల తర్వాత చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీకి కోలుకోలేని దెబ్బలు తగులుతున్నాయి. రాజకీయంగా పార్టీ ఎదుగుదల సంగతి అటుంచితే.. రోజురోజుకూ చేదు అనుభవాలే ఎదురవుతున్నాయని చెప్పొచ్చు. ఇకపోతే 2021 వ సంవత్సరం అయితే నాలుగు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్న టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడుకు చుక్కలు చూపించిందని పలువురు అంటున్నారు.
ఉమ్మడి ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ నేడు విభజిత ఏపీలో ప్రతిపక్ష పాత్రకు పరిమితమై పోయింది. ఇకపోతే ఈ ఏడాది జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలోనూ పార్టీ ఓటమి పాలయింది. ఇకపోతే తన సతీమణిని దూషించారని చంద్రబాబు నాయుడు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. ఈ సంగతి అందరికీ విదితమే. మీడియా సమావేశంలో తన భార్యను దూషించారని వెక్కి వెక్కి ఏడ్చారు. రాజకీయ జీవితంలో ఎప్పుడూ హుందాగావ్యవహరిస్తూ, సీరియస్‌గా కనిపించే చంద్రబాబు విలేకరుల సమావేశంలో కన్నీటి పర్యంతమయ్యారు.
Also Read: చంద్రబాబుకు ఈజీగా అధికారం దక్కబోతోందా?
ఇకపోతే రాష్ట్రంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాభవం మూట కట్టుకుంది. మున్సిపాలిటీలకు, కార్పొరేషన్లకు జరిగిన ఎలక్షన్స్‌లో ఒక తాడిపత్రి మున్సిపాలిటీ మాత్రమే టీడీపీకి దక్కించుకుంది. మిగతా అన్ని స్థానాల్లో అధికార వైసీపీనే క్లీన్ స్వీప్ చేసింది. ఇక బద్వేలు నియోజకవర్గ ఉప ఎన్నికలోనూ అధికార వైసీపీ ఘన విజయం సాధించింది. ఇక చంద్రబాబు ఒకనాడు ఢిల్లీలో చక్రం తిప్పారని పేర్కొనే టీడీపీ వర్గాలకు ఢిల్లీలోనూ షాక్ తగిలినంత పని అయింది.
టీడీపీ కార్యాలయాలపై వైసీపీ దాడులను నిరిస్తూ చంద్రబాబు దీక్షలు చేశారు. ఈ క్రమంలోనే అధికార వైసీపీ పార్టీ రాష్ట్రంలో చేస్తున్న అరాచకాలపై కేంద్రానికి, ప్రధానికి ఫిర్యాదు చేస్తానని వెళ్లిన చంద్రబాబుకు చేదు అనుభవమే ఎదురైంది. కేంద్రమంత్రుల అప్పాయింట్ మెంట్ కూడా చంద్రబాబుకు లభించలేదు. దాంతో ఆయన రాష్ట్రపతిని కలిసి తిరిగి వెనక్కి వచ్చేశారు. మొత్తంగా 2021వ సంవత్సరం బాబుకు చేదు అనుభవాలనే మిగిల్చింది.
Also Read: డ్యామేజ్ పాలిటిక్స్: బలం లేని బీజేపీపై పడ్డ వైసీపీ, టీడీపీ