శకుంతలా దేవి రికార్డును బ్రేక్ చేసిన హైదరాబాదీ

ప్రముఖ గణితవేత్త, హ్యూమన్ కంప్యూటర్ శకుంతలాదేవి జీవితాధారంగా ఇటీవలే బాలీవుడ్లో మూవీ వచ్చింది. శకుంతలా దేవీగా విద్యాబలన్ అద్భుతంగా నటించి మెప్పించింది. నేటితరం యువతకు ఆమె ప్రతిభ తెలియజేసేలా ఈ మూవీని దర్శకుడు చక్కగా తీర్చిదిద్దిన సంగతి తెల్సిందే. అలాంటి శకుంతలా దేవీ రికార్డును ఓ హైదరాబాదీ యువకుడు బ్రేక్ చేశారు. 20ఏళ్లకే వేగవంగతమైన మానవ కంప్యూటర్ గా సరికొత్త రికార్డు సృష్టించి అందరిచేత ఔరా అనిపించుకున్నాడు. Also Read: ఆన్ లైన్ విద్య.. అందరికీ ‘పరీక్ష’గా […]

Written By: Neelambaram, Updated On : August 27, 2020 4:43 pm
Follow us on


ప్రముఖ గణితవేత్త, హ్యూమన్ కంప్యూటర్ శకుంతలాదేవి జీవితాధారంగా ఇటీవలే బాలీవుడ్లో మూవీ వచ్చింది. శకుంతలా దేవీగా విద్యాబలన్ అద్భుతంగా నటించి మెప్పించింది. నేటితరం యువతకు ఆమె ప్రతిభ తెలియజేసేలా ఈ మూవీని దర్శకుడు చక్కగా తీర్చిదిద్దిన సంగతి తెల్సిందే. అలాంటి శకుంతలా దేవీ రికార్డును ఓ హైదరాబాదీ యువకుడు బ్రేక్ చేశారు. 20ఏళ్లకే వేగవంగతమైన మానవ కంప్యూటర్ గా సరికొత్త రికార్డు సృష్టించి అందరిచేత ఔరా అనిపించుకున్నాడు.

Also Read: ఆన్ లైన్ విద్య.. అందరికీ ‘పరీక్ష’గా మారనుందా?

హైదరాబాద్ కు చెందిన నీలకంఠ భానుప్రకాశ్ కు చిన్నతనం నుంచే గణితంపై అమితాసక్తిని పెంచుకున్నాడు. అప్పుడే ఎస్ఐపీ వారి అబాకస్ ప్రోగ్రామ్‌లో చేరి గణితంపై మరింత పట్టును సాధించాడు. అదేవిధంగా ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజీ నుంచి మ్యాథ్స్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. 2011, 2012సంవత్సరాల్లో జాతీయ అబాకస్ చాంపియన్‌షిప్.. 2013లో అంతర్జాతీయ అబాకస్ చాంపియన్‌షిప్ లో పాల్గొని భానుప్రకాశ్ విజేతగా నిలిచాడు. తాజాగా లండన్‌లో జరిగిన ‘మెంటల్ కాలిక్యులేషన్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌’లో భానుప్రకాశ్ పాల్గొని బంగారు పతకం సాధించి సరికొత్త రికార్డు సృష్టించాడు.

1997సంవత్సరం నుంచి ప్రతియేటా మెంటల్ కాలిక్యులేషన్ ప్రపంచ చాంపియన్‌షిప్ జరుగుతోంది. ఈ ఏడాది కరోనా వైరస్ కారణంగా ఈ చాంపియన్‌షిప్‌ను ఆన్‌లైన్లో నిర్వహించారు. ఇందులో యూకే.. జర్మనీ.. యూఏఈ.. ఫ్రాన్స్.. గ్రీస్.. లెబనాన్ తదితర 13దేశాల నుంచి 30మంది పోటీదారులు పాల్గొన్నారు. వీరిలో భానుప్రకాశ్ విజేతగా నిలువడమే కాకుండా పలురికార్డులను తిరగరాశాడు. గతంలో వేగవంతమైన మానవ కాలిక్యులేటర్లుగా రికార్డులు సృష్టించిన శకుంతలా దేవి, స్కాట్ ఫ్లాన్స్‌బర్గ్ రికార్డులను భాను 20ఏళ్ల వయస్సులోనే తిరగరాయడం విశేషం. త్వరలోనే గణితవేత్తలు, మానవ కాలిక్యులేటర్‌లతో ఒక కమ్యూనిటీ ఏర్పాటు చేయడమే తన లక్ష్యమని భానుప్రకాశ్ చెబుతున్నాడు.

Also Read: టీడీపీపై బీజేపీ ఎందుకు కోపంగా ఉంది?

ఇప్పటికే భానుప్రకాశ్ ఎక్స్‌ప్లోరింగ్ ఇన్‌ఫైనెట్స్ పేరుతో ఒక స్టార్టప్ సంస్థను నిర్వహిస్తున్నాడు. దీని ద్వారా పాఠశాలల్లో వర్క్‌షాప్‌లు నిర్వహిస్తూ చిన్నారులకు గణితంపై ఆసక్తిని పెంచుతున్నాడు. తెలంగాణ, టీ-శాట్ నెట్‌వర్క్‌తో కలిసి 6-10 తరగతుల వారి కోసం 700గంటల మ్యాథ్స్ కంటెంట్‌ను అందించేందుకు భానుప్రకాశ్ ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం. గణిత బోధనల్లో మార్పు తీసుకొచ్చి విద్యార్థుల్లో మేధాస్సును పెంచేందుకు కృషి చేస్తానని భానుప్రకాశ్ అంటున్నాడు. 20ఏళ్లకే ఫాసెస్ట్ హ్యుమన్ కంప్యూటర్ గా హైదరాబాద్ కుర్రాడు నిలువడంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.