New Year Celebrations: చెట్టు పేరు చెప్పి కాయలమ్మడం అంటే ఇదే. మద్యం సీసాల మీదే మద్యం తాగడం ఆరోగ్యానికి హానికరం అని రాసినా మద్యం ప్రియులు మాత్రం ఆగడం లేదు. తాగడానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. సందర్భమేదైనా తాగుడే ప్రధాన ఆయుధంగా కనిపిస్తోంది. దీంతో సగటు మనిషి తన జీవితంలో తాగుడే ప్రధాన వినోదంగా మారుతోంది. ఈ నేపథ్యంలో నూతన సంవత్సర వేడుకల సందర్భంగా రెండు తెలుగు స్టేట్లలో మద్యం ఏరులై పారింది. ఏకంగా రూ. కోట్లలో ఆదాయం వచ్చి చేరింది.

దీంతో ప్రభుత్వ ఖజానాలు నిండిపోయాయి. నిన్న ఒక్క రోజే తెలంగాణలో రూ.171 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయంటే పరిస్థతి ఎలా ఉందో అర్థమైపోతోంది. గత ఏడాదితో పోలిస్తే ఈ సారి మద్యం అమ్మకాలు ఎక్కువగానే జరిగినట్లు తెలుస్తోంది. రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు నమోదు కావడంతో ప్రభుత్వానికి ఆదాయం భారీగానే సమకూరింది. దీంతో మద్యం ప్రియులు తమ గొంతు తడుపుకునేందుకే ఎక్కువ విలువ ఇచ్చినట్లు చెబుతున్నారు.
Also Read: కాంగ్రెస్ ను కట్టడి చేస్తున్న పార్టీలు.. ప్రజల్లోకి వెళ్లకుండా అడ్డంకులు
డిసెంబర్ నెల మొత్తంలో రూ.3400 కోట్ల మద్యం అమ్మకాలు జరిగితే జనవరి ఒకటినే రూ.171 కోట్ల మద్యం అమ్ముడు కావడం గమనార్హం. గతంతో పోలిస్తే ఈ సంవత్సరం అదనంగా ఏడు వందల కోట్ల మద్యం అమ్ముడు కావడం విశేషం. దీంతో మద్యం అమ్మకాల్లో ఆదాయం కూడా రెట్టింపవుతోంది. ప్రభుత్వాలకు ప్రధాన ఆదాయ వనరుగా మద్యం తయారవడం తెలిసిందే.
ఆంధ్రప్రదేశ్ లో కూడా మద్యం అమ్మకాలు భారీగానే చోటుచేసుకున్నాయి. నిన్నటి రోజునే రూ. 120 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. తెలంగాణ కంటే తక్కువే అయినా ఆదాయం మాత్రం ఆర్జించడం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో మద్యం అమ్మకాల్లో రెండు స్టేట్లు రెచ్చిపోతున్నాయి. ఆదాయం సమకూర్చుకోవడంలో పోటీ పడుతున్నాయి.
Also Read: అమూల్ కథ: ఏపీలో ఇన్ ఫుట్.. తెలంగాణలో అవుట్ ఫుట్..