17ఏళ్ల ప్రాయం.. వలపుల గాయం

తెలిసీతెలియని వయసు.. అభం శుభం ఎరుగని ప్రాయం.. ఆకర్షణకే విలువ. ఏం జరుగుతుందో కూడా ఆలోచించలేని చిన్నతనం. కానీ వయసు ప్రభావంతో తప్పులు చేయడం. సామాజిక మాధ్యమాల ప్రభావంతో పిల్లలు చెడిపోతున్నారు. పసితనంలో చేయాల్సిన పనులు పక్కన పెట్టేసి వయసు మీరిన వారి పనులు చేస్తూ నేరాల వైపు మళ్లుతున్నారు. చిరు ప్రాయంలోనే పెద్ద వారికన్నా ఎక్కువ చేస్తున్నారు. ఫలితంగా బతుకు భారం చేసుకుంటున్నారు. సరైన దారిలో నడవక తప్పుదారి పట్టి భవిష్యత్తును అంధకారం చేసుకుంటున్నారు. ఒకరికి […]

Written By: Srinivas, Updated On : August 5, 2021 12:30 pm
Follow us on

తెలిసీతెలియని వయసు.. అభం శుభం ఎరుగని ప్రాయం.. ఆకర్షణకే విలువ. ఏం జరుగుతుందో కూడా ఆలోచించలేని చిన్నతనం. కానీ వయసు ప్రభావంతో తప్పులు చేయడం. సామాజిక మాధ్యమాల ప్రభావంతో పిల్లలు చెడిపోతున్నారు. పసితనంలో చేయాల్సిన పనులు పక్కన పెట్టేసి వయసు మీరిన వారి పనులు చేస్తూ నేరాల వైపు మళ్లుతున్నారు. చిరు ప్రాయంలోనే పెద్ద వారికన్నా ఎక్కువ చేస్తున్నారు. ఫలితంగా బతుకు భారం చేసుకుంటున్నారు. సరైన దారిలో నడవక తప్పుదారి పట్టి భవిష్యత్తును అంధకారం చేసుకుంటున్నారు.

ఒకరికి తెలియకుండా మరొకరితో ప్రేమ, పెళ్లి అంటూ ఓ బాలుడు (17) చేసిన ఉదంతం అందరిలో ఆశ్చర్యం కలిగిస్తోంది. చిన్న వయసులోనే ఇంత ఘాతుకానికి తెగించడం వెనుక ఆంతర్యం ఏమిటన్నది అంతుచిక్కడం లేదు. మహబూబాబాద్ జిల్లా గార్ల మండలంలో బుధవారం వెలుగు చూసిన సంఘటనపై పోలీసులు తెలిపిన వివరాలు విస్తుగొలుపుతున్నాయి. గార్ల గ్రామానికి చెందిన బాలుడు పక్క గ్రామంలోని ఓ బాలిక(16)ను ప్రేమ పేరుతో వంచించాడు. శారీరక సంబంధం పెట్టుకున్నాడు. ఇది వారి తల్లిదండ్రులకు తెలియడంతో కొంత డబ్బు చెల్లించి తెగదెంపులు చేసుకున్నాడు.

ఇంతటితో అతడి ఆగడాలు ఆగలేదు. తన కోరికలు పెరిగాయి. అనంతరం మరో బాలిక(17)పై కన్నేశాడు. ఆమెను సైతం లొంగదీసుకుని పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. అయినా అతడి వేషాలకు అడ్డుకట్ట పడలేదు. ఇంకా కావాలనే ఆశతో మూడో బాలికపై కూడా తన వలపుల వల విసిరాడు. ఆమెను కూడా తన ప్రేమ పేరుతో మోసం చేశాడు. బాలుడి ఉదంతంపై అందరు ఆందోళన చెందుతున్నారు. చిన్న వయసులోనే ఇంతలా బరితెగించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. కలియుగ లక్షణాలు కలిగిన బాలుడిగా అభివర్ణిస్తున్నారు.

మూడో బాలిక కుటుంబసభ్యలు స్థానిక పోలీస్ స్టేషన్ లో పరస్పరం ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు విచారణ చేపడుతున్నట్లు ఎస్సై రవి తెలిపారు. బాలుడి బాగోతాలపై ఫిర్యాదులు రావడంతో చర్చనీయాంశం అయింది. పసిప్రాయంలో క్రైం స్టోరీని తలపించేలా బాలుడి ఘటనలు ఉండడంపై అందరు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. వయసు మీద పడిన వారు చేసే విధంగా అడ్డ దారుల్లో ప్రేమ పేరుతో బాలికలను వంచించడంపై పలువురు ఆందోళన చెందుతున్నారు.