లాభాలు రావాలంటే.. అదే దారి !

అన్ని పాన్ ఇండియా సినిమాలు రిలీజ్ డేట్లును ఎనౌన్స్ చేయడంలో పోటీ పడుతూ ఉంటే.. ఫుల్ క్రేజ్ ఉన్న కేజీఎఫ్-2 రిలీజ్ పరిస్థితి పై మాత్రం క్లారిటీ రావడం లేదు. నిజానికి జులై 19నే మా చిత్రం రిలీజ్ అంటూ ఈ ఏడాది బిగినింగ్ లో గ్రాండ్ గా ఎనౌన్స్ చేసింది టీమ్. కానీ, కరోనా సెకండ్ వేవ్ తో ప్లాన్ మారింది. అయితే, ఆ మార్పు ఎక్కడికి పోస్ట్ ఫోన్ అయింది అనేదే తెలియడం లేదు. […]

Written By: admin, Updated On : August 5, 2021 12:44 pm
Follow us on

అన్ని పాన్ ఇండియా సినిమాలు రిలీజ్ డేట్లును ఎనౌన్స్ చేయడంలో పోటీ పడుతూ ఉంటే.. ఫుల్ క్రేజ్ ఉన్న కేజీఎఫ్-2 రిలీజ్ పరిస్థితి పై మాత్రం క్లారిటీ రావడం లేదు. నిజానికి జులై 19నే మా చిత్రం రిలీజ్ అంటూ ఈ ఏడాది బిగినింగ్ లో గ్రాండ్ గా ఎనౌన్స్ చేసింది టీమ్. కానీ, కరోనా సెకండ్ వేవ్ తో ప్లాన్ మారింది. అయితే, ఆ మార్పు ఎక్కడికి పోస్ట్ ఫోన్ అయింది అనేదే తెలియడం లేదు.

ఈ సినిమా ఫస్ట్ కాపీ కూడా ఎప్పుడో రెడీ అయింది. మొదట క్రిస్మస్ కి రిలీజ్ అనుకున్నారు. హిందీలో ‘లాల్ సింగ్ చద్దా’ లాంటి భారీ సినిమా, అలాగే ‘పుష్ప’ కూడా క్రిస్మస్ కి ఖరారయ్యాయి కాబట్టి, ఆ సినిమాల మీద పోటీకి దిగడం ఇష్టం లేదు కెజిఎఫ్ మేకర్స్ కి. సరే, సంక్రాంతి సీజన్ లో ప్లాన్ చేద్దాం అంటే.. ఇప్పటికే ఏడు భారీ సినిమాలు రేసులో ఉన్నాయి.

ఇక దసరాకు రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’, దీపావళికి సూపర్ స్టార్ ‘అన్నాత్తె’ ఫిక్స్ అయిపోయాయి. దీనికి తోడు మధ్యలో గ్యాప్ దొరికితే దూరిపోవడానికి ‘ఆచార్య’ రెడీగా ఉన్నాడు. మొత్తమ్మీద కలెక్షన్స్ వచ్చే సీజన్లన్నింటికీ బెర్తులు ఖరారు అయిపోవడంతో ‘కేజీఎఫ్-2’ రిలీజ్ విషయంలో ఏం చేయాలో అర్ధం కాక, మేకర్స్ సైలెంట్ అయిపోయారు.

మరోపక్క అభిమానులేమో రిలీజ్ డేట్ ప్రకటించాలంటూ సోషల్ మీడియాలో హడావిడి చేస్తున్నారు. కానీ రిలీజ్ డేట్ ను ప్రకటించే పరిస్థితి ఇప్పట్లో లేదు. ఒకవేళ అన్ని కుదిరితే దీపావళికి దసరాకి మధ్యలో రిలీజ్ చేయాలని ప్లాన్ అయితే ఉంది. కాకపోతే.. మూడో వేవ్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి కాబట్టి, రిస్క్ చేయలేరు. మొత్తమ్మీద కేజీఎఫ్ 2 రిలీజ్ అనేది ఇప్పట్లో ఇక కష్టమే.

అయినా తొందరపడితే అసలుకే మోసం వస్తోంది . ముఖ్యంగా కరెక్ట్ టైంలో రిలీజ్ అవ్వకపోతే భారీ కలెక్షన్స్ రావడం అసాధ్యం. మరి వందల కోట్లు పెట్టి తీసిన సినిమాకి బిజినెస్ పరంగా లాభాలు రావాలంటే.. కచ్చితంగా సోలో రిలీజ్ డేట్ ఉండాలి. సో.. సోలో డేట్ కోసం ‘కేజిఎఫ్ 2’ మేకర్స్ పక్కా ప్లాన్ తో ముందుకు పోయే ఆలోచనలో ఉన్నారు.