దేశంలో ప్రస్తుతం నడుస్తున్న హార్ట్ ట్రెండింగ్ టాపిక్ సోనియా మళ్లీ కాంగ్రెస్ పార్టీ నాయకత్వ బాధ్యతలను స్వీకరించడమే. కాంగ్రెస్ లో నాయకత్వ మార్పు విషయంలో నెలకొన్న అంతర్గత సంక్షోభం తారస్థాయికి చేరింది. రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవిని చేపట్టేందుకు సముఖంగా లేరని నిన్నటితో తేటతెల్లమైంది. అయితే లోపల మాత్రం చాలా విషయం జరిగిందని అందుకు భిన్నమైన కథనాలు వినిపిస్తున్నాయి.
Also Read : అమరావతి విషయంలో బాబు వ్యూహం…. మొదటికే మోసం?
2019 ఎన్నికల్లో ఓటమికి బాధ్యత వహిస్తూ రాహుల్ గాంధీ పార్టీ నాయకత్వ బాధ్యతలను వదులుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో సోనియా పార్టీ పగ్గాలు చేపట్టారు. ఆమె ఆరోగ్యం బాగా లేకపోవడంతో ప్రియాంక గాంధీ కూడా గాంధీ కుటుంబం నుండే కాకుండా ఇతర నేతలకు పార్టీ పగ్గాలు అప్పగించడం పై తాము సానుకూలంగా ఉన్నామని ప్రకటించేసింది.
అయితే ఇదంతా నాణానికి ఒక వైపు. మరొక వైపుకి వస్తే…. రాహుల్ కు పార్టీ పగ్గాలు అప్పగించే విషయంలో పార్టీలో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. పార్టీ ప్రక్షాళన అవసరం అని పేర్కొంటూ…. రాహుల్ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ పార్టీలో 23 మంది సీనియర్ నేతలు అధినేత్రి సోనియా గాంధీకి లేఖ రాయడంపై సోమవారం నాటి సిడబ్ల్యుసి సమావేశంలో హాట్ హాట్ చర్చ జరిగింది. ఒకవైపు తన అధ్యక్ష పదవిని వద్దంటున్నారు…. తన నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ లేఖ రాశారు కానీ వారు మాత్రం అధ్యక్ష పదవిని చేపట్టేందుకు సిద్ధంగా లేరు. ఇదే రాహుల్ గాంధీని తీవ్రమైన మండిపాటుకి గురిచేసింది.
ఒకపక్క మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాజకీయాలు క్లిష్టతరంగా ఉన్న సందర్భంలో సోనియా ఆరోగ్యం కూడా బాగా లేని పరిస్థితుల్లో అసలు సీనియర్లు ఆమెకు లేఖ రాయాల్సిన అవసరం ఏముందని రాహుల్ నిలదీశారు. అసమ్మతి సభ్యులు బిజెపితో చేతులు కలిపారని.. అతి తీవ్రమైన వ్యాఖ్యలు చేసారట. పార్టీ తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటున్న సమయంలో ఇలాంటి రాజకీయాలు చేయడం భావ్యమా అని ప్రశ్నించాడట. దీంతో ఒక్కసారిగా సమావేశంలో కలకలం రేగింది.
Also Read : గెలుపు కోసం మోదీ నే నమ్ముకున్న ట్రంప్
సీనియర్ నేతలు కపిల్ సిబాల్, గులాం నబీ ఆజాద్ రాహుల్ కి సమాధానం ఇచ్చారు. “ఇక మీరు ఆరోపించినట్లు ఒకవేళ నేను బీజేపీ ఏజెంట్ అని నిరూపించబడితే ఇప్పుడే రాజీనామా చేసి బయటకు వెళ్లి పోతాను” అని ఆజాద్ రాహుల్ గాంధీతో పేర్కొనడం గమనార్హం. తాము లేఖ రాయడానికి సీడబ్ల్యూసీ సభ్యుల వ్యవహార శైలి కారణమని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఎంతైనా కానీ వారు తమ నిజాయితీని విశ్వసనీయతను చాటుకునే అవకాశం రాహుల్ ఇస్తారా లేదా అన్న సంగతి పక్కన పెడితే…. సోనియాగాంధీ వేరే గత్యంతరం లేక తప్పనిసరి పరిస్థితుల్లో పార్టీ నాయకత్వ పగ్గాలను అందుకున్నారని అర్థమవుతోంది.