Corona Cases in AP: ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు భయపెడుతున్నాయి. రోజురోజుకు కేసుల వ్యాప్తిలో పురోగమనం కనిపిస్తోంది. ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావంతోనే కేసులు పెరుగుతున్నాయని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కరోనా రక్కసి ఏ ప్రాంతాన్ని వదలడం లేదు. దేశవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసుల సంఖ్య కారణంగా ప్రజల్లో ఆందోళన నెలకొంటోంది. ఇప్పటికే ఆంక్షలు కఠినతరం చేస్తున్నా కేసుల సంఖ్య మాత్రం తగ్గడం లేదు.
ఈ నేపథ్యంలో పాఠశాలల మూసివేతపై మాత్రం ఏపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. తెలంగాణలో స్కూళ్లు మూసివేసినా ఇక్కడ మాత్రం కేసుల సంఖ్య రెట్టింపవుతున్నా ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం తో విమర్శలు వస్తున్నాయి. గడిచిన ఇరవై నాలుగు గంటల్లో 46 వేల మందికి పరీక్షలు నిర్వహించగా 13 వేల కేసులు వెలుగు చూశాయి.
గతంలో కూడా సీఎం జగన్ ఆంధ్రప్రదేశ్ లో కేసులు పెరుగుతున్నా ఆంక్షలు మాత్రం విధించలేదు. ఫలితంగా కరోనా ప్రభావం ఎక్కువైంది. ప్రస్తుతం అదే కోవలో వెళుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. మాస్కులు ధరించాలి. భౌతిక దూరం పాటించాలని చెబుతున్నారు. కరోనా వైరస్ ను అంతమొందించే వరకు విశ్రమించొద్దని చెబుతున్నారు.
Also Read: India Corona Cases: కరోనా కేసులు ఇక తగ్గవా? ఆందోళన పుట్టిస్తున్న వైరస్?
రాష్ర్టంలో ప్రస్తుతం దాదాపు లక్ష యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడిస్తోంది. దీంతో కరోనా రక్కసి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతూనే ఉంది. ప్రతి సంవత్సరం ఇలా లక్షలాది మందిని పొట్టన పెట్టుకుంటోంది. ఏపీలో కరోనా కేసుల నిర్మూలనకు అందరు సహకరించాలని కోరుతున్నారు. వైరస్ ను తుదముట్టించే క్రమంలో జాగ్రత్తలు పాటించాలని చెబుతున్నారు.
అన్ని స్టేట్లు దాదాపు నిబంధనలు కఠినతరం చేశాయి. దీంతో కొన్ని ప్రాంతాల్లో లాక్ డౌన్ కూడా విధిస్తున్నారు. కేసుల సంఖ్య పెరగడంతో ఆందోళన కూడా ఎక్కువవుతోంది. ఈ నేపథ్యంలో కరోనా మహమ్మారిని అంతం చేయాలని అందరు భావిస్తున్నారు. దీని కోసం ఆంక్షలు కఠిన తరం చేసినా కేసుల సంఖ్యలో మాత్రం తేడా రావడం లేదు. ఇంకా ఏం విపత్తులు ఎదుర్కోవాల్సి వస్తుందో అనే అనుమానాలు అందరిలో వస్తున్నాయి.
Also Read: Self care for corona: కరోనా పట్ల ఆందోళన వద్దు.. అప్రమత్తతతో జాగ్రత్తలు ముద్దు..