Russia Ukraine War: ప్రస్తుతం ఉక్రెయిన్‌లో ఎలాంటి భయానక వాతావరణం ఉందో అందరం చూస్తూనే ఉన్నాం. రష్యా సాగిస్తున్న మారణ హోమంలో.. ఉక్రెయిన్ ప్రజలు బిక్కు బిక్కు మంటూ గడుపుతున్నారు. ఏ క్షణంలో ఏ రూపంలో మరణం వస్తుందో తెలియక ప్రాణాలను అరచేతిలో పట్టుకుని దేశం విడిచి పారిపోతున్నారు. ఇలా ఓ 11 ఏండ్ల బాలుడు కూడా ప్రాణాలను కాపాడుకునేందుకు వెయ్యి కిలోమీటర్ల ఒంటరి ప్రయాణం చేసి దేశ సరిహద్దులు దాటిన ఘటన ఇప్పుడు అందరినీ కలిచి వేస్తోంది.

ఆ దేశంలో ఉన్న పరిస్థితులను ఈ ఘటన కండ్లకు కడుతోంది. ఉక్రెయిన్ లోని జపోరిషియా ప్రాంతంలో ఉంటున్న ఓ బాలుడు ఇప్పుడు రైలు మార్గం ద్వారా ఒంటరి ప్రయాణం చేసి స్లోవేకియా దేశానికి చేరుకున్నాడు. అయితే అతన్ని గుర్తించిన అధికారులు మీ తల్లిదండ్రులు ఎక్కడా అని ప్రశ్నించారు. వాళ్లెవరూ తనతో రాలేదని చెప్పడంతో.. అతని చేతి మీద ఉన్న ఫోన్ నెంబర్‌ను చూసి వెంటనే కాల్ చేసి మాట్లాడారు.
ఆ బాలుడి తల్లి చెప్పిన ప్రకారం స్లోవేకియాలో ఉంటున్న వారి బంధువులకు ఆ బాలుడిని అప్పగించారు అధికారులు. ఈ విషయాన్ని స్లోవేకియా అంతర్గత వ్యవహారాల శాఖ ఫేస్ బుక్‌లో తెలిపింది. ఆ బాలుడిని క్షేమంగా వారి బంధువులకు అప్పగించామని కథ సుఖాంతం అయిందంటూ తెలిపింది. కాగా ఆ బాలుడి కుటుంబంలో ఒకరికి అనారోగ్య సమస్యలు ఉండటం వల్లే తల్లిదండ్రులు అక్కడే ఉండిపోయారని సమాచారం.

అయితే ఆ తల్లి తన కొడుకును అయినా బతికించుకోవాలనే ఆరాటంలో ఇలా చేసిందని అంటున్నారు అధికారులు. అయితే ఈ ఘటన ఉక్రెయిన్ లో ఉన్న భయానక పరిస్థితులను కండ్లకు కడుతున్నాయంటూ చాలామంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ బాలుడి లాంటి వారు ఉక్రెయిన్ లో ఇంకెంతమంది ఉన్నారో అంటూ వాపోతున్నారు. ఇంకొందరేమో అన్ని కిలోమీటర్లు ఒంటిరిగా ప్రయాణం చేసి ప్రాణాలను నిలుపుకున్న ఆ బాలుడిని హీరో అని కామెంట్లు పెడుతున్నారు.
[…] Russia Ukraine War: మేధావులు మూర్ఖులంటారు. ఇది నిజమే అనిపిస్తుంది. కొన్ని సంఘటనలు చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా మూర్ఖుడేనా అనుకోవాల్సి వస్తుంది. ప్రపంచ దేశాలన్ని యుద్దం వద్దనివారిస్తున్నా పుతిన్ మాత్రం వినడం లేదు. వాటి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవడం లేదు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నా వాటిని సైతం పట్టించుకోవడం లేదు. ఫలితంగా ఏకాకిగా మిగిలిపోతున్నా నిర్లక్ష్యమే ఆయన సమాధానం కావడం నిస్సందేహంగా మూర్ఖత్వమే. కానీ పుతిన్ మాత్రం తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లని వాదిస్తున్నారు. […]