Pooja Hegde: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ‘రాధే శ్యామ్’ మార్చి 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా ‘రాధేశ్యామ్’లో ప్రేరణగా నటించిన పూజా హెగ్డే మాట్లాడుతూ… ఏదైనా ఓడ మునిగిపోతున్నట్లు కన్పిస్తే… మీరు టైటానిక్ విషాదానికి కనెక్ట్ అవుతారు. అయితే ‘రాధే శ్యామ్’ని ఇంత క్లాసిక్ సినిమాతో పోల్చాలి. అని చెప్పుకొచ్చింది.

అయితే, పూజా హెగ్డేను సోషల్ మీడియాలో నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. రాధేశ్యామ్ మూవీ గురించి ఆమె ఇంటర్వ్యూ ఇచ్చింది. పూజా మాట్లాడుతూ.. సక్సెస్ అనబోయి అనుకోకుండా సె** అంటూ పలకబోయింది. అయితే వెంటనే సరిదిద్దుకుంది. కానీ ఇది పట్టేసిన నెటిజన్లు పూజను రకరకాలుగా ట్రోల్ చేస్తున్నారు. మొత్తానికి టాల్ బ్యూటీ బూతులు బాగా మాట్లాడుతుంది అంటూ ట్రోల్ చేస్తున్నారు.
ఇక పూజా హెగ్డే కెరీర్ ఫుల్ స్వింగ్ లో ఉంది. దాంతో అమ్మడు ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. షూటింగ్స్, మీటింగ్స్ నుంచి కొంచెం విరామం దొరకడంతో చక్కగా ఇంటిలోనే ఉంటుంది. అందమైన ఫ్యామిలీ లైఫ్ ను ఆహ్లాదంగా గడిపేస్తుందట. అందుకే, చాలా గ్యాప్ తర్వాత సినిమా ప్రమోషన్స్ కి వచ్చింది కాబట్టి.. ఇలా తప్పు మాట్లాడింది అట. అన్నట్టు రాధే శ్యామ్ తో పాటు పూజా, విజయ్ కి జంటగా చేస్తున్న బీస్ట్ మూవీను కూడా పూర్తి చేసింది.
అలాగే సల్మాన్ ఖాన్ కి జంటగా బాలీవుడ్ లో చేస్తున్న భాయ్ జాన్ సినిమాలో కూడా పూజా నటిస్తోంది. మొదట్లో ఈ చిత్రానికి కభీ ఈద్ కభీ దివాళి అనే టైటిల్ నిర్ణయించారు. అనంతరం భాయ్ జాన్ గా మార్చడం జరిగింది. ఇక పూజా హెగ్డే నటించిన ఆచార్య సైతం విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే ప్రస్తుతం రాధేశ్యామ్ వరల్డ్ వైడ్ గా విడుదల అవుతుంది.

అందుకే, ఈ సినిమా ప్రమోషన్స్ లో పూజా ఫుల్ బిజీగా ఉంది. కాగా మహేష్ తో త్రివిక్రమ్ ప్రకటించిన చిత్రంతో పాటు, హరీష్ శంకర్-పవన్ కళ్యాణ్ ప్రకటించిన భవదీయుడు భగత్ సింగ్ చిత్రాలలో హీరోయిన్ గా పూజా పేరు పరిశీలనలో ఉంది.