https://oktelugu.com/

10th class pattern: ప్రభుత్వం సాహసం: పదోతరగతిలో సమూల మార్పులు

100కు 100 మార్కులు వచ్చిన స్టూడెంట్ ను అందరూ నెత్తిన పెట్టుకునేవారు. అతడి ఫొటోలను విద్యాసంస్థలు పేపర్లు, మీడియాల్లో ప్రకటనలతో హోరెత్తించారు. విద్యార్థుల ప్రతిభకు పట్టం కట్టేవారు. కానీ ఈ ఆలోచన ప్రతిభ గల విద్యార్థులకు మేలు చేసినా.. మిగతా విద్యార్థుల్లో మాత్రం ఒత్తిడి పెంచుతోంది. ఈ క్రమంలోనే విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు 2010లో గ్రేడింగ్ విధానం తీసుకొచ్చారు. మార్కులు 100కు 100 కాకుండా వాటి స్థానంలో గ్రేడ్లు, గ్రేడ్ పాయింట్ల స్థానం ప్రవేశపెట్టారు. అయితే ఇప్పుడు […]

Written By: , Updated On : August 28, 2021 / 09:57 AM IST
Follow us on

Schools Reopen

100కు 100 మార్కులు వచ్చిన స్టూడెంట్ ను అందరూ నెత్తిన పెట్టుకునేవారు. అతడి ఫొటోలను విద్యాసంస్థలు పేపర్లు, మీడియాల్లో ప్రకటనలతో హోరెత్తించారు. విద్యార్థుల ప్రతిభకు పట్టం కట్టేవారు. కానీ ఈ ఆలోచన ప్రతిభ గల విద్యార్థులకు మేలు చేసినా.. మిగతా విద్యార్థుల్లో మాత్రం ఒత్తిడి పెంచుతోంది. ఈ క్రమంలోనే విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు 2010లో గ్రేడింగ్ విధానం తీసుకొచ్చారు. మార్కులు 100కు 100 కాకుండా వాటి స్థానంలో గ్రేడ్లు, గ్రేడ్ పాయింట్ల స్థానం ప్రవేశపెట్టారు.

అయితే ఇప్పుడు ఆ గ్రేడ్ల విధానానికి ఏపీ ప్రభుత్వం మంగళం పాడింది. మళ్లీ మార్కుల విధానాన్ని తీసుకొస్తూ పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి రాజశేఖర్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రవేశాలు, నియామకాల్లో ప్రతిభను గుర్తించేందుకు గత ఏడాది నుంచి మార్కులు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.

సాధారణంగా గ్రేడ్ల విధానంతో పలు ఇబ్బందులు ఎదురవుతున్నాయని ప్రభుత్వం గుర్తించింది. ఎక్కువమంది విద్యార్థులకు ఏ గ్రేడ్ వస్తే ప్రవేశాలు, నియామకాల్లో సమస్యలు వస్తున్నాయని.. ఈ నేపథ్యంలోనే గ్రేడ్ల స్తానంలో మార్కులు ఇవ్వాలని సంచాలకులు ప్రతిపాదనలు సమర్పించినట్లు వెల్లడించారు.

ఈ క్రమంలోనే ఏపీ ప్రభుత్వం 2019 మార్చి వరకు విద్యార్థులకు గ్రేడ్లు, గ్రేడ్ పాయింట్లు ఇస్తారు. 2020 మార్చి నుంచి మార్కులు కేటాయిస్తారు. కరోనా కారణంగా గత రెండేళ్లుగా పరీక్షలను నిర్వహించలేదు. ఈ నేపథ్యంలో ఈ సంవత్సరం నుంచి మళ్లీ మార్కుల విధానం తేవాలని ఏపీ ప్రభుత్వం యోచిస్తోంది.

గత ఏడాది ఇంటర్ ప్రవేశాల సందర్భంగా తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. కరోనా కారణంగా పదోతరగతి విద్యార్థులకు పరీక్షలు నిర్వహించకపోవడంతో అందరికీ ఒకే గ్రేడ్లు వచ్చాయి. దీంతో ఇంటర్ ప్రవేశాల్లో విద్యార్థులకు సీట్ల కేటాయింపు చాలా కష్టమైంది. దీంతో ఈ గ్రేడింగ్ వ్యవస్థనే ప్రభుత్వం రద్దు చేసింది. దాని స్థానంలో మార్కుల విధానాన్ని తీసుకొచ్చింది. ఎన్నో ఏళ్లుగా విద్యార్థుల్లో ఒత్తిడి తగ్గించేందుకు.. ఆత్మహత్యల నివారణకు గ్రేడింగ్ విధానాన్ని అమలు చేశారు. కానీ ఇప్పుడు మళ్లీ మార్కుల పోటీని ఏపీ ప్రభుత్వం మొదలుపెట్టింది.