పేదల అకౌంట్లో 10వేలు జమ చేయాలి: జగ్గారెడ్డి

తెలంగాణలో ప్రభుత్వం పేదలకు అందిస్తున్న రూ.1,500సాయాన్ని 10వేలకు పెంచాలని సంగారెడ్డి ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. లాక్డౌన్ వల్ల పేదప్రజలకు ఉపాధి లేకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రభుత్వానికి కొంత భారమైనప్పటికీ పేదల అకౌంట్లో రూ.10వేలు జమ చేయాలని కోరారు. అదేవిధంగా కరోనా మహమ్మరిపై పోరాడుతున్న వైద్యులు, పోలీసులు, పారిశుధ్య కార్మికులకు అదనపు ఖర్చుల కింద ప్రోత్సాహాక నగదును ఇవ్వాలన్నారు. వీరిపై ప్రస్తుతం అదనపు పని భారం పెరిగిందని వీరి సేవలను గుర్తించి […]

Written By: Neelambaram, Updated On : April 29, 2020 3:07 pm
Follow us on


తెలంగాణలో ప్రభుత్వం పేదలకు అందిస్తున్న రూ.1,500సాయాన్ని 10వేలకు పెంచాలని సంగారెడ్డి ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. లాక్డౌన్ వల్ల పేదప్రజలకు ఉపాధి లేకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రభుత్వానికి కొంత భారమైనప్పటికీ పేదల అకౌంట్లో రూ.10వేలు జమ చేయాలని కోరారు. అదేవిధంగా కరోనా మహమ్మరిపై పోరాడుతున్న వైద్యులు, పోలీసులు, పారిశుధ్య కార్మికులకు అదనపు ఖర్చుల కింద ప్రోత్సాహాక నగదును ఇవ్వాలన్నారు. వీరిపై ప్రస్తుతం అదనపు పని భారం పెరిగిందని వీరి సేవలను గుర్తించి ప్రభుత్వం వేతనంతోపాటు పారితోషకం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.

ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుతున్నాయనని రాష్ట్రం ప్రభుత్వం ప్రకటిస్తుందని ఈ వార్త నిజమైతే సంతోషమేనని అన్నారు. లాక్డౌన్ డిసెంబర్ వరకు కొనసాగించాలనేది తన వ్యక్తిగత అభిప్రాయమని దీనికి పార్టీతో సంబంధం లేదన్నారు. మన రాష్ట్రం అమెరికా, ఇటలీల కావొద్దని అభిప్రాయంతో ఆ సూచన చేశానని తెలిపారు. రాష్ట్రంలో మే7 తర్వాత ఒకవేళ లాక్డౌన్ కొనసాగిస్తే మాత్రం వలస కార్మికులు కోరుకుంటున్నట్లుగా వారిని తమ సొంతూళ్ల పంపించాలని జగ్గారెడ్డి సూచించారు. లాక్డౌన్ వల్ల వలస కార్మికులకు ఉపాధిలేక ఒత్తికి లోనవుతున్నారని తెలిపారు. కొందరు కాలినడన సొంతూళ్లకు వెళుతూ ప్రాణాలను పొగొట్టుకుంటారని వారి ఆవేదనను ప్రభుత్వం గుర్తించాలని కోరారు. వలస కార్మికులు సొంతూళ్లకు వెళ్లేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. అకాల వర్షాలు, వడగండ్ల వానలతో నష్టపోయిన రైతన్నలను ప్రభుత్వం సాయమందించి ఆదుకోవాలని జగ్గారెడ్డి విజ్ఞప్తి చేశారు.