ప్రముఖ నటుడు ఇర్ఫాన్ ఖాన్ మృతి

విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్(53) బుధవారం ముంబైలో తుదిశ్వాస విడిచారు. గతంలో కాన్సర్ వ్యాధి బారిన ఇర్ఫాన్ లండన్లో చికిత్స చేయించుకున్నారు. అనంతరం ఇండియాకు తిరిగొచ్చి ముంబైలో చికిత్స చేయించుకుంటున్నారు. ఈక్రమంలో మంగళవారం తీవ్ర అస్వస్థతకు గురైన ఇర్ఫాన్ ఖాన్ ను ముంబైలోని కోకిలా బెన్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తుండగానే బుధవారం పరిస్థతి విషమించి ఇర్ఫాన్ ఖాన్ మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన మృతితో బాలీవుడ్లో విషాదచాయలు నెలకొన్నాయి. ఇర్ఫాన్ ఖాన్ ‘సలామ్ […]

Written By: Neelambaram, Updated On : April 29, 2020 2:29 pm
Follow us on


విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్(53) బుధవారం ముంబైలో తుదిశ్వాస విడిచారు. గతంలో కాన్సర్ వ్యాధి బారిన ఇర్ఫాన్ లండన్లో చికిత్స చేయించుకున్నారు. అనంతరం ఇండియాకు తిరిగొచ్చి ముంబైలో చికిత్స చేయించుకుంటున్నారు. ఈక్రమంలో మంగళవారం తీవ్ర అస్వస్థతకు గురైన ఇర్ఫాన్ ఖాన్ ను ముంబైలోని కోకిలా బెన్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తుండగానే బుధవారం పరిస్థతి విషమించి ఇర్ఫాన్ ఖాన్ మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన మృతితో బాలీవుడ్లో విషాదచాయలు నెలకొన్నాయి.

ఇర్ఫాన్ ఖాన్ ‘సలామ్ బాంబే’ మూవీ ద్వారా 1988లో బాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచమయ్యారు. ‘పాన్ సింగ్ తోమార్’ మూవీలో ఇర్ఫాన్ నటనకుగాను జాతీయ ఉత్తమ నటుడి అవార్డు దక్కింది. ఆయన బాలీవుడ్ మూవీలతోపాటు బిట్రిష్, హలీవుడ్లో సినిమాల్లో నటించారు. ‘స్లమ్ డామ్ మిలియనీర్, ‘ఇన్ఫెర్నో’, ‘లైఫ్ ఆఫ్ పై’ వంటి చిత్రాలతో అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకున్నారు. అదేవిధంగా తెలుగులో ‘సైనికుడు’ సినిమాలో నటించాడు. ఇందులో ‘పప్పు యాదవ్’ క్యారెక్టర్లో నటించి మెప్పించారు. ఇక చివరగా ఆయన నటించిన చిత్రం ‘అంగ్రేజి మీడియం’. ఈ మూవీ మార్చి 13న రిలీజ్ అయింది.

కాగా ఈనెల 25న ఇర్ఫాన్ ఖాన్ తల్లి సయీదా బేగం రాజస్థాన్లో కన్నుమూశారు. లాక్డౌన్ కారణంగా ముంబైలో ఉన్న ఇర్ఫాన్ తల్లి అంత్యక్రియలకు వెళ్లలేకపోయాడు. తల్లిని కడసారిగా వీడియోలో చూసుకున్నాడు. తన తల్లి చనిపోయిన కొద్దిరోజుల్లోనే ఇర్ఫాన్ ఖాన్ మృతిచెందడం ఆయన కుటుంబంలో విషాదాన్ని నింపింది. ఇర్ఫాన్ ఖాన్ కు భార్య సుతాప, ఇద్దరు కుమారులు బబిల్, అయాన్ ఉన్నారు. ఆయన మృతివార్తను తొలుత దర్శకుడు సుజిత్ సర్కార్ ట్వీట్ చేసి ఇర్ఫాన్ కుటుంబానికి సానుభూతిని తెలియజేశాడు. ఇర్ఫాన్ మృతివార్తను తెలుసుకున్న పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన ఆత్మశాంతి చేకూరాలని ప్రార్థించారు.