రానున్న రోజుల్లో 10లక్షల కరోనా కేసులు

కరోనా మహమ్మరి పేరు వింటేనే ప్రపంచం బెంబేలెత్తిపోతుంది. చిన్న, పెద్ద తేడా లేకుండా అందరిపై కరోనా ప్రభావం చూపుతోంది. కరోనా దాటికి పేద దేశాలే కాకుండా ధనిక దేశాలు సైతం అల్లాడిపోతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా 8లక్షల కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. చైనాలోని వూహాన్లో పుట్టిన కరోనా ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నింటికి పాకింది. చైనాలో కరోనా కట్టడి కొంతమేర జరిగిన మిగతా దేశాలు మాత్రం కరోనా దాటికి అతలాకుతలం అవుతున్నాయి. అగ్రరాజ్యమైన అమెరికా కరోనా రాక్కసికి విలవిలలాడిపోతుంది. […]

Written By: Neelambaram, Updated On : April 2, 2020 2:04 pm
Follow us on


కరోనా మహమ్మరి పేరు వింటేనే ప్రపంచం బెంబేలెత్తిపోతుంది. చిన్న, పెద్ద తేడా లేకుండా అందరిపై కరోనా ప్రభావం చూపుతోంది. కరోనా దాటికి పేద దేశాలే కాకుండా ధనిక దేశాలు సైతం అల్లాడిపోతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా 8లక్షల కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. చైనాలోని వూహాన్లో పుట్టిన కరోనా ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నింటికి పాకింది. చైనాలో కరోనా కట్టడి కొంతమేర జరిగిన మిగతా దేశాలు మాత్రం కరోనా దాటికి అతలాకుతలం అవుతున్నాయి.

అగ్రరాజ్యమైన అమెరికా కరోనా రాక్కసికి విలవిలలాడిపోతుంది. కరోనాతో దాదాపు 2లక్షల మంది చనిపోతారని అమెరికానే ప్రకటించడం కరోనా తీవ్రతకు అద్దంపడుతోంది. అగ్రరాజ్యమే కరోనా దాటికి దాసోమవుతున్న తరుణంలో మిగతా దేశాల పరిస్థితి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇటలీ దేశంలో మరణ మృందంగా కొనసాగుతోంది. ఇక బ్రిటన్, స్పెయిన్ దేశాల్లో రాజ కుటుంబాలే కరోనాతో మృత్యువాత పడుతున్నారంటే సామాన్యుల పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇండియాలోనూ కరోనా కేసులు 2వేలకు చేరువతుండటం ఆందోళన కలిగిస్తుంది. అయితే రానున్న రోజుల్లో 10లక్షలకు పైగా కరోనా కేసులు పెరిగిపోతాయని డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిస్తుంది.

కరోనా మహమ్మరి కట్టడికి కేంద్రం 21లాక్డౌన్ అమలు చేస్తుంది. దీనివల్ల మిగతా దేశాలతో పొలిస్తే భారత్ కరోనా కేసులు చేయిదాటకుండా కట్టడి చేయగలిగింది. అయితే గత రెండు మూడురోజులుగా కరోనా కేసులు అన్ని రాష్ట్రాల్లోనూ భారీగా పెరిగిపోతుండటం ఆందోళన కలిగిస్తుంది. కరోనాకు ఢిల్లీ మర్కజ్ కు లింకు బయటపడటంతో దేశంలో కలవరం మొదలైంది. మర్కజ్ లో ప్రార్థనలకు వెళ్లిన వారి వివరాలను కేంద్రం ఆయా రాష్ట్రాలకు సమాచారం అందించారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో మర్కజ్ కు వెళ్లొచ్చిన వారిలో పాజిటివ్ కేసులు నమోదవుతుండటంతో రెండు రాష్ట్రాలు అలర్ట్ అయ్యారు.

మర్కజ్ ప్రార్థనలకు వెళ్లొచ్చిన వివరాలను రెండు తెలుగు రాష్ట్రాలకు సేకరించి వారికి కరోనా టెస్టులను చేస్తున్నారు. తెలంగాణలో నిన్న ఒక్కరోజే 30పాజిటివ్ కేసులు నమోదుగా కాగా వీరిందరికీ మర్కజ్ లింకు ఉన్నట్లు తేలింది. దీంతో మర్కజ్ వెళ్లొచ్చిన వారికి ఐసోలేషన్ వార్డులకు తరలిస్తున్నారు. మరికొందరి వివరాలు తెలియాల్సి ఉండగా వీరికోసం ప్రత్యేక టీములు రంగంలోకి దిగి గాలింపు చేస్తున్నాయి.

కరోనా కేసులు ప్రపంచ వ్యాప్తంగా 10లక్షలకు పైగా పెరుగుతుందని తాజాగా డబ్ల్యూహెచ్ఓ ప్రకటించింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా భయాందోళనలు నెలకొన్నాయి. కరోనా పట్ల ప్రజలు నిర్లక్ష్యంగా వ్యహరించొద్దని డబ్ల్యూహెచ్ఓ సూచిస్తుంది. ప్రభుత్వాలు ఇచ్చే సలహాలు, సూచనలు పాటించాని.. కరోనాకు స్వీయనియంత్రణే మందని చెబుతుంది. ప్రజలంతా ఈ నియమాలను పాటిస్తూ కరోనా కట్టడికి సహకరించాలని డబ్ల్యూహెచ్ఓ కోరుతుంది.