Corona: గత రెండేండ్లుగా ప్రపంచాన్ని కరోనా ఎంతలా వణికిస్తుందో అందరికీ తెలిసిందే. ఓ వేరియంట్ ప్రభావం పూర్తి కాగానే మరోవేరియంట్ పుట్టుకొస్తోంది. ఇలా ఎంత డెవలప్ అయిన దేశాలు అయినా దానికి వణికిపోతున్నాయి. అయితే ఈ వైరస్ చేరని దేశాలు కూడా ఉన్నాయండోయ్. ఆ దేశాల్లో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదంట. ఇక్కడ మరో విషయం ఏంటంటే.. ఈ దేశాలు అన్నీ కూడా ద్వీపాలు కావడం ఇక్కడ విశేషం.

దక్షిణ ఫసిఫిక్ సముద్రంలో ఉండే టువాలు ద్వీపంలో ఒక్క కేసు కూడా రాలేదు. ఇప్పటికే ఇక్కడ 71శాతం మందికి రెండో డోసు కూడా వేశారు. అలాగే ఇదే ప్రాంతంలో ఉండే టోకిలౌ ద్వీపంలో కూడా కరోనా అడుగు పెట్టలేదు. ఈ దేశంలో కూడా 50శాతం మందికి రెండో డోసు వేసి ఉంచారు. ఇక దక్షిణ అట్లాంటిక్ సముద్రంలో ఉండే సెయింట్ హెలెనా దేశంలో వైరస్ జాడ లేదు. ఈ దేశంలో 58శాతం జనాభాకు సెకండ్ డోస్ కంప్లీట్ చేశారు.
అలాగే దక్షిణ ఫసిఫిక్ ప్రాంతంలో ఉండే ఫిట్ కెయిర్న్ ఐల్యాండ్ లో కూడా కరోనా కేసు ఒక్కటి కూడా నమోదు కాలేదు. ఈ ద్వీపానికి దగ్గరలో ఉండే నియూ దేశంలో, అలాగే ఆస్ట్రేలియా దేశంకు దగ్గరగా ఉండే నౌరు దేశంలో, ఆ పక్కనే ఉండే మైక్రోనేషియా దేశాల్లో కూడా కరోనా కేసులో ఒక్కటంటే ఒక్కటి కూడా రాలేదు.


ఇక వనౌటు, మార్షల్ ఐల్యాండ్, కూక్ ఐల్యాండ్స్ దేశాల్లో అయితే కరోనా కేసులు పదుల సంఖ్యలోనే ఉన్నాయి. రేపో మాపో అవి కూడా రికవరీ అయ్యే ఛాన్స్ ఉంది. వీటికి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే.. ఇక్కడి కరోనా రాకముందే వ్యాక్సిన్లు వచ్చాయి. దాంతో అందరికీ వ్యాక్సిన్లు వేసి రెడీగా ఉంచారు. ఇక నార్త్ కొరియా, తుర్కమొనిస్థాన్ దేశాల్లో అసలు కరోనా కేసులు ఉన్నాయో లేవో కూడా ఎవరికీ పెద్దగా తెలియదు. ఎందుకంటే ఆ దేశాల్లో ఏం జరుగుతుందో, కరోనా కేసుల గణాంకాలను ప్రపంచానికి తెలియనివ్వకుండా రహస్యంగా ఉంచుతున్నాయి. దీంతో అక్కడి పరిస్థితులు ఎవరికీ తెలియట్లేదు.
Also Read: కన్ఫ్యూజ్ చేస్తున్న గంటా.. చంద్రబాబు రమ్మన్నా రావట్లే.. వేరే ప్లాన్ ఉందా..?


Also Read: అప్పుడే పవన్ కళ్యాణ్ కు సీఎం ఛాన్స్.. కానీ ఈ సింపుల్ లాజిక్ గుర్తిస్తేనే?