
ఏపీ సీఎం జగన్ పై కేసులకు కొదవ లేదు. ఇప్పటికే సీబీఐ 11, ఈడీ 6 కేసులు పెట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుతం జగన్ అక్రమాస్తుల కేసులో మరో కేసు చేరింది. ఈ కేసులు 12 సంవత్సరాలుగా వివిధ కోర్టుల్లో విచారణలు జరుగుతున్నాయి. వైఎస్సార్ మరణం తరువాత జరిగిన రాజకీయ పరిణామాల్లో కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి సొంతంగా వైఎస్సార్ సీపీ పెట్టారు. విజయం సాధించి అధికారం చేపట్టారు. కాంగ్రెస్ నుంచి బయటకు రాగానే కేసులన్ని నమోదయ్యాయి. ఇప్పటి నుంచి ఇప్పటివరకు కొనసాగుతూనే ఉన్నాయి.
తాజాగా ఉమ్మడి రాష్ర్టంలో ఏపీ హౌసింగ్ బోర్డు, ఇందు ప్రాజెక్టు ఆధ్వర్యంలో మొదలైన హౌసింగ్ ప్రాజెక్టులో అక్రమాలు జరిగాయనే ఆరోపణలతో అభియోగ పత్రాన్ని ఈడీ దాఖలు చేసింది. ఇందులో జగన్ తోపాటు మరో11 మందిని నిందితులుగా చేర్చింది. తనపై ప్రేరేపించిన కేసులన్నీ రాజకీయంగా పెట్టినవే అని జగన్ వాదిస్తున్నారు. జగన్ కాంగ్రెస్ పార్టీలో ఉంటే కేసులు ఉండేవి కావని నేతలు చెబుతున్నారు.
పన్నెండు ఏళ్లుగా కేసులు నత్తనడకన సాగుతున్నాయి. అధికారంలో ఉన్న వైసీపీ అధికారం అడ్డుపెట్టుకుని జగన్ అవినీతికి పాల్పడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. అవినీతిలో భాగస్వాములుగా అభియోగాలు ఎదుర్కొంటున్న ఐఏఎస్ అధికారుల పాత్ర లేదని చాలా మందిపై కేసులు కొట్టేసింది. కోర్టు ఇలాగే మంత్రి వర్గానికి సంబంధం లేదని మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం కోర్టుకు సమాధానం చెప్పింది.
జగన్ పై ఉన్నకేసులు ఇన్ని సంవత్సరాలుగా దర్యాప్తు చేస్తున్నా ఒక కేసు కూడా పరిష్కారానికి నోచుకోలేదు. క్విడ్ కో కేసుల్లో చాలా వాటిని కోర్టులు కొట్టేశాయి. ఇంకెంత కాలం కేసుల విచారణ సాగుతుందో తెలియడం లేదు. ఈ పరిస్థితుల్లో తాజాగా మరో కేసు నమోదు కావడంతో విచారణ ఇంకెంత కాలం పడుతుందో అనే విషయం ఎవరికి తెలియడం లేదు.