
ఏపీలో ప్రస్తుతం ఉన్న 13జిల్లాలకు మరో మూడు జిల్లాలను ఏర్పాటు చేసేందుకు జగన్ సర్కార్ రంగం సిద్ధం చేసింది. అరకు, మచిలిపట్నం, గురజాల ప్రాంతాలను జిల్లాలుగా ప్రకటించింది.
Read More: ‘గూగుల్ పే’ కస్టమర్లకు గుడ్ న్యూస్..
గతంలోనే ఆంధ్రప్రదేశ్ లో 26జిల్లాల ప్రతిపాదన ఉన్నప్పటికీ.. ప్రస్తుతం మూడు జిల్లాలను ఏర్పాటుచేయాలని జగన్ సర్కార్ నిర్ణయించింది. అయితే కృష్ణ జిల్లాలో మచిలీపట్నం కాదు, విశాఖపట్నంలో ఉన్న మచిలీపట్నం, గుంటూరులో ఉన్న గురజాల మరియు వైజాగ్ దగ్గర్లో ఉన్న అరకు అనే కొత్త జిల్లాల ఏర్పాటుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది.
Read More: మండలి రద్దు: కేంద్రంలో కొత్త చట్టం.. జగన్ కి షాక్!
అయితే ఏర్పాటు చేయనున్న ఈ మూడు జిల్లాలలోనే మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయబోతున్నట్లు ఈమధ్య ప్రభుత్వం ప్రకటించింది. ఇలా ఓ మెడికల్ కాలేజీ ఏర్పాటు చెయ్యాలంటే 600 కోట్ల దాకా ఖర్చవుతుంది. ఐతే బాగా వెనకబడిన జిల్లాల్లో రాష్ట్ర ప్రభుత్వం వీటిని ఏర్పాటు చేస్తే వీటి ఏర్పాటుకు అయ్యే ఖర్చులో 60 శాతాన్ని మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇస్తుంది. అంటే మూడు కాలేజీలకి కలిపి మొత్తం రూ.1800 కోట్లు అవుతుందనుకుంటే మెడికల్ కౌన్సిల్ నుండి 1080 కోట్లు వస్తాయి. ఫలితంగా ప్రభుత్వానికి అయ్యే ఖర్చు రూ.720 కోట్లే అవుతుంది. ఇప్పుడు ప్రభుత్వ ఖజానాలో డబ్బు లేదు. అప్పులు చేసే ఉద్దేశం ప్రభుత్వానికి లేదు. ఈ క్రమంలో రాయతీ పొందేందుకు ఆ మూడు ప్రాంతాల్నీ జిల్లాలుగా మార్చనున్నట్లు తెలిసింది.
Read More: రాక్షసుడిగా నాని కొత్త లుక్.. అదిరిపోయిందిగా