
తెలంగాణలో కరోనా మహమ్మరి రోజురోజుకు పంజా విసురుతోంది. కొద్దిరోజలు క్రితం వరకు కరోనా పాజిటివ్ కేసులు సింగిల్ డిజిట్ పరిమితమయ్యేవి. దీంతో తెలంగాణలో కరోనా తగ్గుముఖం పడుతుందని అందరూ భావించారు. అయితే ఇందుకు విరుద్ధంగా కేసుల సంఖ్య సింగిల్ డిజిట్ నుంచి క్రమంగా పేరుతో వందల్లో నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తుంది. గతవారంరోజులుగా కరోనా కేసులు మూడంకెల డిజిట్ కు తక్కువగా నమోదు కావడం లేదు. దీంతో గాంధీ ఆస్ప్రతి వైద్య సిబ్బందిపై పనిభారం పెరుగుతుంది. దీంతో వైద్యులు, సిబ్బంది ఒత్తిడికి లోనవుతున్నట్లు తెలుస్తోంది.
శనవారం ఒక్కరోజే కరోనా కేసులు 200లకు పైబడి రావడంతో గాంధీ ఆస్పత్రి నిండుకుంది. మే 26వరకు గాంధీలో 650మంది కరోనా పేషంట్లు ఉన్నారు. కేవలం పది రోజుల్లోనే ఈ సంఖ్య 805 పెరిగింది. ప్రస్తుతం 1,455రోగులు ఉండగా ఆస్పత్రి పడకల సామర్థ్యం దాదాపు నిండిపోయినట్లు సమాచారం. ఆస్పత్రిలో సుమారుగా 1,160 పడకలుండగా కరోనా తీవ్రత దృష్ట్యా 350మందిని వైద్య కళాశాలలో అదనంగా సర్దినట్లు తెలుస్తోంది. మే నెల నుంచి కరోనా కేసుల పెరుగుతుండటంతో కొన్నినెలలుగా నిరంతరం సేవలందిస్తున్న వైద్యసిబ్బందికి తలకు మించిన భారం మారుతుండటంతో ఒత్తిడికి లోనవుతున్నారు.
ఇదిలా ఉంటే నిమ్స్ లో 20మందికి వైద్య కరోనా సోకినట్లు యాజమాన్యం ప్రకటించింది. దీంతో నిమ్స్ లో ఓపీ, రోగుల అడ్మిట్ లను తాత్కాలికంగా నిలిపివేసినట్లు తెలుస్తోంది. అయితే పూర్తిస్థాయిలో సేవలు నిలిచిపోయినట్లు రోగులు వాపోతున్నారు. నిమ్స్‌లో కార్డియాలజీ విభాగంలో ఓ రోగికి కరోనా సోకిందని సమాచారం. అతడి నుంచి ప్రొఫెసర్లకు, వైద్యులకు వ్యాప్తించడంతో ఆస్పత్రిలో నియంత్రణ చర్యలు ప్రారంభించారు. ఆస్పత్రిలో వైరస్ వ్యాప్తిని నివారించేందుకు శానిటైజేషన్ వంటి ప్రకియ చేపట్టారు. దీంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులను సైతం డిశ్చార్జి చేసి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే వెంటిలేటర్లపై చికిత్స పొందుతున్న వారికి ఎక్కడి తరలించాలో తెలియక ఆస్పత్రి యాజమాన్యం తలలు పట్టుకుంది. దీనిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాల్సిందే..!