స్వర్ణా ప్యాలెస్ ప్రమాదానికి బాధ్యులు ఎవరు?

విజయవాడలో జరిగిన స్వర్ణా ప్యాలెస్ (కోవిడ్ ఆసుపత్రి)లో అగ్ని ప్రమాదానికి ఎవరి వారే మా తప్పు లేదంటే… మా తప్పు లేదంటూ తప్పించుకోవాలని చూస్తున్నారు. ప్రభుత్వం తమ తప్పు లేదని ఇది ప్రభుత్వ ఆసుపత్రి కాదని చెబుతుంది. ప్రైవేటు ఆసుపత్రి కావడంతో… ఆసుపత్రి యాజమాన్యం నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగిందని తేల్చింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని మీడియా సమావేశంలో విషయాన్ని వెల్లడించారు. ఆసుపత్రి యాజమాన్యం మాత్రం సంఘటనలో తమ తప్పు […]

Written By: Neelambaram, Updated On : August 10, 2020 8:52 pm
Follow us on


విజయవాడలో జరిగిన స్వర్ణా ప్యాలెస్ (కోవిడ్ ఆసుపత్రి)లో అగ్ని ప్రమాదానికి ఎవరి వారే మా తప్పు లేదంటే… మా తప్పు లేదంటూ తప్పించుకోవాలని చూస్తున్నారు. ప్రభుత్వం తమ తప్పు లేదని ఇది ప్రభుత్వ ఆసుపత్రి కాదని చెబుతుంది. ప్రైవేటు ఆసుపత్రి కావడంతో… ఆసుపత్రి యాజమాన్యం నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగిందని తేల్చింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని మీడియా సమావేశంలో విషయాన్ని వెల్లడించారు. ఆసుపత్రి యాజమాన్యం మాత్రం సంఘటనలో తమ తప్పు లేదని ప్రకటించింది. మహాత్మాగాంధీ రోడ్డులోని రమేష్ ఆసుపత్రిలో కోవిడ్ సెంటర్ ఏర్పాటు చేసినా అక్కడ 30 బెడ్ లు మాత్రమే ఉండటంతో పేషంట్ల నుంచి చికిత్సకు వినతులు ఎక్కువ అవడంతో స్వర్ణా ప్యాలెస్ హోటల్ ను అద్దెకు తీసుకుని ప్రభుత్వ అనుమతితోనే కోవిడ్ సెంటర్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

Also Read: ఇంతకీ ఆ గుమ్మడికాయల దొంగ ఎవరు నాగబాబు…?

ఆసుపత్రి యాజమాన్యం స్వర్ణపాలెస్ ను అద్దెకు తీసుకునేటప్పుడు ప్రమాదం జరిగినప్పడు అత్యవసర పరిస్థితి నెలకొంటే బయటకు వెళ్లేందుకు ఉన్న మార్గాలు, అగ్ని ప్రమాదం జరిగినప్పుడు అలారం, మంటలు ఆర్పేందుకు అవసరమైన పరికరాలు అందుబాటులో ఉన్నాయో లేదో చూడాల్సిన బాధ్యత ఆసుపత్రి యాజమాన్యానికి ఉండదా అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. హోటల్ యాజమాన్యం మాత్రం ప్రమాదంపై ఇప్పటి వరకూ స్పందించలేదు. దీంతో ఆసుపత్రి యాజమాన్యం ప్రమాదానికి మా బాధ్యత లేదని తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తుంది. కంప్యూటర్ రూం లో షార్ట్ సర్య్కూట్ కారణంగా మంటలు వ్యాప్తి చెంది రబ్బరు మాట్ లకు అంటుకోవడం అవి పెద్దవై పర్నీచర్కు వ్యాపించడం, అక్కడ నిల్వ ఉంచిన శానిటైజర్ లకు వ్యాప్తించి మంటలు మరింత తీవ్ర స్థాయికి చేరుకోవడం జరిగినట్లు ప్రాధమిక విచారణలో పోలీసులు తేల్చారు.

రమేష్ ఆసుపత్రి నిర్వహిస్తున్న ఈ కోవిడ్ సెంటర్ కు అనుమతి విషయంలో భిన్న వాదనలు ఉన్నాయి. రమేష్ ఆసుపత్రి యాజమాన్యం ప్రభుత్వ అనుమతితో కోవిడ్ ఆసుపత్రి నిర్వహిస్తున్నట్లు చెబుతున్నారు. మరోవైపు జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ మాత్రం తాము ఇక్కడ ఆసుపత్రి నిర్వహించేందుకు ఎటువంటి అనుమతి ఇవ్వలేదని తెలిపారు. ఇక్కడ కోవిడ్ ఆసుపత్రి ఉన్నట్టు తమ దృష్టికి రాలేదని రెవెన్యూ అధికారులు అంటున్నారు. కోవిడ్ ఆసుపత్రి నిర్వహించాలంటే అగ్నిమాపక శాఖ అనుమతి ఇవ్వాల్సిన అవసరం ఉందని, తాము ఈ కోవిడ్ సెంటర్ కు ఎటువంటి అనుమతి ఇవ్వలేదని అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జయరాం తెలిపారు. ఈ వ్యవహారం చూస్తుంటే ఇందులో ఎన్నో లొసుగులు ఉన్నట్లు తెలుస్తోంది.

Also Read: అమరావతి ప్రజలకు షాక్ ఇచ్చేలా జగన్ బంపర్ ఆఫర్…!

రమేష్ ఆసుపత్రి యాజమాన్యం విజయవాడ నగరంలో మొత్తం ఏడు హోటళ్లను అద్దెకు తీసుకుని కోవిడ్ కేర్ సెంటర్ లను నిర్వహిస్తున్న వెల్లడలయ్యింది. ఇప్పుడు వీటిలో ఎన్నింటికి ఆనుమతులు ఉన్నాయనే విషయంపై అధికారులు ఆరా తీస్తున్నారు. రమేష్ ఆసుపత్రికి ఉన్న పేరుప్రతిష్టల కారణంగా ఈ సంస్థ నిర్వహిస్తున్న కోవిడ్ కేర్ సెంటర్ లలో అధిక సంఖ్యలో కోవిడ్ రోగులు చేరుతున్నారు. వీరి వద్ద నుంచి రోజుకు రూ.35 నుంచి 55 వేలు వరకూ వసూలు చేస్తున్నారు. ఒక్కో రోగి నుంచి సుమారు రూ. 5 నుంచి 10 లక్షలు చికిత్స పూర్తయ్యే నాటికి వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. స్వర్ణా ప్యాలెస్ ప్రమాదంలో ఏ1 గా రమేష్ ఆసుపత్రి, ఎ2 గా స్వర్ణా ప్యాలెస్ హోటల్ పేర్కోంటూ స్థానిక తహశీల్దారు ఫిర్యాదులో పోలీసులు కేసు నమోదు చేశారు.