కియారా జోరు మామూలుగా లేదుగా..

కియారా… కియారా. బాలీవుడ్‌లో ఇప్పుడు ఈ పేరు మార్మోగుతుంది. వెబ్‌ సిరీస్‌లు అయినా… స్ట్రెయిట్‌ మూవీస్‌ అయినా.. దర్శకుల ఫస్ట్‌ చాయిస్‌ ఆమెనే అవుతుంది. 2014లో వచ్చిన హిందీ కామెడీ సినిమా ‘ఫుగ్లీ’తో వెండి తెరకు పరిచయమైంది ఈ ముంబై ముద్దుగుమ్మ. అయితే, కియారా మొదటి ఐదేళ్లలో చేసింది ఐదు సినిమాలే. కానీ, గత రెండేళ్లలోనే ఆమె ఆరు చిత్రాలు చేసింది. మరో నాలుగు సినిమాల్లో నటిస్తోందంటే బాలీవుడ్‌లో ఆమె జోరు ఎలా నడుస్తుందో అర్థం చేసుకోవచ్చు. […]

Written By: Neelambaram, Updated On : August 10, 2020 8:40 pm
Follow us on


కియారా… కియారా. బాలీవుడ్‌లో ఇప్పుడు ఈ పేరు మార్మోగుతుంది. వెబ్‌ సిరీస్‌లు అయినా… స్ట్రెయిట్‌ మూవీస్‌ అయినా.. దర్శకుల ఫస్ట్‌ చాయిస్‌ ఆమెనే అవుతుంది. 2014లో వచ్చిన హిందీ కామెడీ సినిమా ‘ఫుగ్లీ’తో వెండి తెరకు పరిచయమైంది ఈ ముంబై ముద్దుగుమ్మ. అయితే, కియారా మొదటి ఐదేళ్లలో చేసింది ఐదు సినిమాలే. కానీ, గత రెండేళ్లలోనే ఆమె ఆరు చిత్రాలు చేసింది. మరో నాలుగు సినిమాల్లో నటిస్తోందంటే బాలీవుడ్‌లో ఆమె జోరు ఎలా నడుస్తుందో అర్థం చేసుకోవచ్చు. 2018లో మహేశ్‌ బాబు సరసన ‘భరత్‌ అనే నేను’తో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన ఆమె గతేడాది రామ్‌ చరణ్‌తో ‘వినయ విధేయ రామ’లో కూడా నటించింది. కానీ, ఆ తర్వాత పూర్తిగా బాలీవుడ్‌పైనే దృష్టి పెట్టిందామె.

Also Read: కరోనా – బాలయ్య మధ్యలో బోయపాటి !

అర్జున్‌ రెడ్డి హిందీ రీమేక్‌ ‘కబీర్ సింగ్‌’ హిట్‌తో కియారా లైఫ్‌ టర్న్‌ అయింది. అగ్ర దర్శకులు, హీరోలు ఆమె వెంట పడుతున్నారు. ప్రస్తుతం ఇందూకీ జవానీ, భూల్‌ భులయ్యా 2, షేర్ షా, లక్ష్మీ బాంబ్‌ అనే సినిమాల్లో నటిస్తోందామె. అన్నీ భారీ చిత్రాలే. ఇప్పుడు మరో క్రేజీ ఆఫర్ ఆమెను వరించింది. వరుణ్ ధావన్‌ హీరోగా రాజ్‌ మెహతా దర్శకత్వం వహించే చిత్రంలో హీరోయిన్‌గా ఎంపికైంది. కరణ్ జోహార్ నిర్మించే ఈ చిత్రంలో అనిల్‌ కపూర్, నీతూ సింగ్‌ కూడా కీలక పాత్ర పోషించనున్నారు. ప్రి ప్రొడక్షన్‌ పనుల్లో ఉన్న మూవీ నవంబర్ లో సెట్స్‌పైకి వెళ్లనుంది. అక్షయ్‌ కుమార్ హీరోగా నటించిన హిట్‌ మూవీ ‘గుడ్‌ న్యూస్‌’లో కియారా ప్రదర్శన మెచ్చిన రాజ్‌ మెహతా ఆమెకు చాన్స్‌ ఇచ్చాడు. దాంతో, ఈ ఏడాది ఆమె ఏడో సినిమాకు సైన్‌ చేసినట్టయింది.

Also Read: రెమ్యునిరేషన్ పెంచితే న్యూడ్ సీన్స్ కైనా రెడీ !

ఇప్పటికే నెట్‌ ఫ్లిక్స్ ‌మూవీ గిల్టీ, అంగ్రేజీ మీడియం (స్పెషల్‌ సాంగ్‌)తో విజయాలు సొంతం చేసుకున్నాయి. అక్షయ్‌ కుమార్ సరసన నటించిన లక్ష్మీ బాంబ్‌తో పాటు ఇందూకీ జవానీ చిత్రకరణ జరుపుకొని రిలీజ్‌కు సిద్ధంగా ఉండగా.. షేర్షా పోస్ట్ ప్రొడక్షన్‌ దశలో ఉంది. భూల్‌ భులయ్యా చిత్రీకరణ కరోనా కారణంగా ఆగింది. కియారా జోరు చూస్తుంటే ఈ మరికొన్ని ప్రాజెక్టులకు ఓకే చెప్పి ఒకే ఏడాది పది సినిమాలు చేసిన రికార్డు సొంతం చేసుకునేలా కనిపిస్తోంది. ఆమె ఊ అనాలే గానీ హిందీలోనే కాకుండా తెలుగు, తమిళ్‌లోనూ ఆఫర్లు క్యూ కడతాయి. తెలుగులో ఇప్పటికే పలు చిత్రాల్లో కియారా పేరు వినిపించింది. కానీ, బాలీవుడ్‌పైనే పూర్తిగా దృష్టి పెట్టిన ఈ ముంబై బ్యూటీకి దక్షిణాది కథలు వినే తీరిక కూడా లేదట. కియారా జోరు చూసి పలువురు స్టార్ హీరోయిన్లు, స్టార్ కిడ్స్‌ సైతం ఆశ్చర్యపోతున్నారు. ఇదే ఊపు కొనసాగిస్తే మరో ఏడాదిలో కియారా బాలీవుడ్‌ అగ్ర కథానాయికగా మారిన ఆశ్చర్యం లేదు.