https://oktelugu.com/

వీరమరణం పొందిన 20మంది జవాన్లు వీరే..

గడిచిన నెలరోజులుగా భారత్-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈనేపథ్యంలో భారత్-చైనా మధ్య కొన్నిరోజులుగా ఆర్మీ, దౌత్య ఉన్నతాధికారులు చర్చలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా సరిహద్దుల్లో ఉద్రిక్తతను తగ్గించేందుకు ఇరుదేశాలు ఎల్ఓసీ వద్ద తిరిగి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. అయితే సోమవారం రాత్రి 3గంటల సమయంలో ఇరుదేశాల మధ్య ఘర్షణ జరిగింది. చైనా భారత సైనికులపై దొంగదెబ్బతీయడంతో ఒక కల్నల్ స్థాయిలో అధికారితోపాటు 19మంది సైనికులు వీరమరణం పొందారు. ఈ ఘటనపై యావత్ దేశం ఆవేదన వ్యక్తం చేస్తూ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : June 17, 2020 5:21 pm
    Follow us on


    గడిచిన నెలరోజులుగా భారత్-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈనేపథ్యంలో భారత్-చైనా మధ్య కొన్నిరోజులుగా ఆర్మీ, దౌత్య ఉన్నతాధికారులు చర్చలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా సరిహద్దుల్లో ఉద్రిక్తతను తగ్గించేందుకు ఇరుదేశాలు ఎల్ఓసీ వద్ద తిరిగి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. అయితే సోమవారం రాత్రి 3గంటల సమయంలో ఇరుదేశాల మధ్య ఘర్షణ జరిగింది. చైనా భారత సైనికులపై దొంగదెబ్బతీయడంతో ఒక కల్నల్ స్థాయిలో అధికారితోపాటు 19మంది సైనికులు వీరమరణం పొందారు. ఈ ఘటనపై యావత్ దేశం ఆవేదన వ్యక్తం చేస్తూ వీరజవాళ్లకు ఘన నివాళి పలికింది.

    ఇరుదేశాల మధ్య ఒక్కతూటా పేలకపోయినప్పటికీ ఇరుదేశాల సైనికులు మృతిచెందడం ఆందోళన కలిగిస్తుంది. చైనా సైనికులు ప్లాన్ ప్రకారంగా రాళ్లు, రాడ్లతో దాడిచేయగా భారత జవాన్లు ప్రతిదాడికి సిద్ధమయ్యారు. దీంతో ఈ ఘర్షణలో 20మంది భారత జవాన్లు మృతిచెందినట్లు తెలుస్తోంది. చైనా సైనికులు దాదాపు 40మంది మృతిచెందినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఆ దేశం అధికారిక ప్రకటన చేయలేదు. భారత సైనికులే తమ సరిహద్దుల్లోకి వచ్చి దాడి చేశారని చైనా ఆరోపిస్తోంది. చైనా వ్యాఖ్యలను కేంద్రం తిప్పికొడుతోంది.

    ఈనేపథ్యంలో ప్రధాని మోదీ కీలక భేటి నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. ఈనెల 19న అన్ని రాష్ట్రాల్లోని పార్టీ అధ్యక్షులతో మీటింగ్ నిర్వహించి చైనాను ఎలా ఎదుర్కోవాలో వ్యూహాన్ని సిద్ధం చేస్తున్నారు. కాగా భారత జవాన్ల మృతిపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘అమరులైన బలిదానాలు ఊరికేపోవు.. ఈ అంశంలో ఎవరికీ అనుమానం అవసరం లేదు.. భారత్ శాంతి కోరుకుంటోంది. కానీ, సరైన సమయం వస్తే దీటుగా జవాబు ఇవ్వడానికి భారత్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది.. అమర జవాన్ల విషయంలోదేశం గర్వ పడుతుంది. వారు పోరాడుతూ ప్రాణాలు అర్పించారు..’ అని ప్రధాని మోదీ తెలిపారు. సీఎంలతో నిర్వహిస్తూ వీడియో కాన్ఫరెన్స్ లో ప్రధాని మోదీ పిలుపు మేరకు, ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లు రెండు నిమిషాల పాటు మౌనం పాటించి అమర జవాన్లకు అంజలి ఘటించారు.

    20మంది వీరజవాన్ల వివరాలు..
    తాజాగా చైనా సైన్యంతో జరిగిన ఘర్షణలో అమరులైన వీర జవాన్ల వివరాలను భారత సైన్యం ప్రకటించింది. తెలంగాణలోని సూర్యాపేటకు చెందిన కల్నల్ సంతోష్ బాబు కూడా చైనా-భారత్ ఘర్షణలో వీరమరణం పొందారు. కల్నల్ సంతోష్ బాబు(సూర్యాపేట), నాయబ్ సుబేదార్ నాథూరామ్ సోరెన్(మయూర్ భంజ్), నాయబ్ సుబేదార్ మన్‌దీప్ సింగ్(పాటియాలా), నాయబ్ సుబేదార్(డ్రైవర్) సత్నం సింగ్(గురుదాస్ పూర్), కె. పళని(మధురై), హవల్దాన్ సునీల్ కుమార్(పాట్నా), హవల్దాన్ బిపుల్ రాయ్(మీరట్), ఎన్‌కే(ఎన్ఏ) దీపక్ కుమార్(రేవా), సిపాయి రాజేష్ ఓరంగ్(బీర్ఘుం), సిపాయి కుందన్ కుమార్ ఓఝా(సాహిబ్‌గంజ్), సిపాయి గణేష్ రామ్(కాంకేర్), సిపాయి చంద్రకాంత ప్రధాన్(కందమాల్), సిపాయి అంకుష్(హమీపూర్), సిపాయి గుర్బీందర్(సంగ్రూర్), సిపాయి గుర్తేజ్ సింగ్(మాన్సా), సిపాయి చందన్ కుమార్(భోజ్‌పూర్), సిపాయి అమన్ కుమార్(సమస్తిపూర్), సిపాయి జై కిశోర్ సింగ్(వైశాలి), సిపాయి గణేష్ హండ్సా(ఈస్ట్ సింగ్‌భూమి), సిపాయి కుందన్ కుమార్(సహర్ష)లు వీరమరణం పొందినట్లు భారత ఆర్మీ ప్రకటించింది.