https://oktelugu.com/

టీఆర్ఎస్ కోవర్టులే కేటీఆర్ ను ఇరికించాయా?

ఇటీవల మంత్రి కేటీఆర్ ఓ ఫాంహౌస్ వివాదంలో ఆయన చెడ్డపేరు తెచ్చుకున్నారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఏకంగా కేటీఆర్ ఫాంహౌస్ అంటూ అన్ని పత్రాలు సంపాదించి మరీ గ్రీన్ ట్రిబ్యునల్ కు ఎక్కి ఇరుకునపెట్టారు. ఎంతో పకడ్బందీగా ఉండే కేసీఆర్, కేటీఆర్ లకు ఈ వ్యవహారం లీక్ కావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే దీనిపై ఆరాతీసిన కేసీఆర్, కేటీఆర్ లకు టీఆర్ఎస్ లోని కాంగ్రెస్ కోవర్లులే ఈ లీకులను ఆధారాలను రేవంత్ రెడ్డికి […]

Written By:
  • NARESH
  • , Updated On : June 17, 2020 5:34 pm
    Follow us on


    ఇటీవల మంత్రి కేటీఆర్ ఓ ఫాంహౌస్ వివాదంలో ఆయన చెడ్డపేరు తెచ్చుకున్నారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఏకంగా కేటీఆర్ ఫాంహౌస్ అంటూ అన్ని పత్రాలు సంపాదించి మరీ గ్రీన్ ట్రిబ్యునల్ కు ఎక్కి ఇరుకునపెట్టారు. ఎంతో పకడ్బందీగా ఉండే కేసీఆర్, కేటీఆర్ లకు ఈ వ్యవహారం లీక్ కావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

    అయితే దీనిపై ఆరాతీసిన కేసీఆర్, కేటీఆర్ లకు టీఆర్ఎస్ లోని కాంగ్రెస్ కోవర్లులే ఈ లీకులను ఆధారాలను రేవంత్ రెడ్డికి ఇచ్చారన్న విషయం తెలిసిందట. టీఆర్ఎస్ లోని ఒక కోవర్టు విభాగం కేసీఆర్ తర్వాత ప్రభుత్వంలో అన్నీ తానై వ్యవహరిస్తున్న కేటీఆర్ ను అణిచివేయడానికి లేదంటే ఆయన పరువు తీయడానికి ప్రయత్నిస్తోందని గులాబీ దళపతికి తెలిసినట్టు ప్రచారం సాగుతోంది.

    కేటీఆర్ ఆస్తుల గురించి కొన్ని కీలకపత్రాలను టీఆర్ఎస్ కోవర్టులు ప్రత్యర్థులకు లీక్ చేస్తున్నారని.. కేటీఆర్ ఆస్తుల గురించి పత్రాలకు కాంగ్రెస్ కు లీక్ చేస్తున్నారని టీఆర్ఎస్ నాయకత్వం నిర్ధారణ కు వచ్చిందట.. ఇందుకు బలమైన ఆధారాలను కూడా సేకరించినట్టు తెలిసింది.

    ఈ విషయంలో రేవంత్ రెడ్డి ఒక పావు మాత్రమేనని టీఆర్ఎస్ పార్టీ భావిస్తోందట.. వెనుక నుంచి నడిపిస్తున్న వ్యక్తి వేరే ఉన్నాడని గులాబీ నాయకత్వం అంచనావేసిందట.. కేసీఆర్ తీరుపై అసంతృప్తిగా ఉన్న కొందరు టీఆర్ఎస్ నాయకులు అదును చూసి దాడి చేయాలని నిర్ణయించుకున్నారని టీఆర్ఎస్ కు ఉప్పందింది.

    అయితే కేసీఆర్ పై ఏదైనా దాడి చేస్తే తెలంగాణపై దాడిగా చిత్రీకరిస్తున్నారు. ఎందుకంటే తెలంగాణను సాధించిన వ్యక్తిగా కేసీఆర్ కు కాస్త క్రెడిబులిటీ ఉంది. కాబట్టి తెలంగాణ పోరాట చరిత్రలో లేని కేటీఆర్ ను టార్గెట్ చేసి ఇలా అభాసుపాలు చేయాలని డిసైడ్ అయినట్టు తెలిసింది.

    టీఆర్ఎస్ లో కీలక నేత హరీష్ ను పక్కనపెట్టి ఇప్పుడు కీలక నేతగా ఎదుగుతున్న కేటీఆర్ పై ఫోకస్ చేసిన కోవర్టులు ఆయన ఎన్నికల అఫిడవిట్లు, ఇతర పత్రాలను రేవంత్ రెడ్డి ద్వారా లీక్ చేస్తున్నట్టు టీఆర్ఎస్ అధిష్టానం గుర్తించింది.

    అయితే ఇప్పటికిప్పుడు కేటీఆర్ ను దెబ్బతీయడం కష్టమే అయినా ఆయనపై ప్రతీకూల ప్రచారం చేసి ఆయన విశ్వసనీయతను దెబ్బతీసే కుట్ర జరుగుతోందని సమాచారం. తద్వారా భావి సీఎం అనుకుంటున్న కేటీఆర్ ను అభాసుపాలు చేయడానికి నిర్ణయించారట.. రేవంత్, ఇతర కాంగ్రెస్ నాయకులకు డేటాను ఇచ్చి ప్రోత్సహిస్తున్నారని తెలుస్తోంది.