రేషన్ కోసం ప్రజలు పడిగాపులు

కరోనా ప్రభావంతో రాష్ట్ర ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు అవకాశం లేకుండా పోయింది. పేదలకు పనులు లేకపోవడంతో ఈ నెల 29 నుంచి రేషన్ పంపిణీ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తొలి రోజు రేషన్ దుకాణాల ముందు ప్రజలు పడిగాపులు పడాల్సి వచ్చింది. ప్రతి కుటుంబానికి 5 కేజీల బియ్యం, కేజీ కందిపప్పు ఇస్తామని అధికారులు ప్రకటించడంతో ఆదివారం తెల్లవారుజాము నుంచే కార్డుదారులు డిపోల వద్ద పడిగాపులు పడ్డారు. ఈ పోస్ విధానం వల్ల […]

Written By: Neelambaram, Updated On : March 29, 2020 8:43 pm
Follow us on

కరోనా ప్రభావంతో రాష్ట్ర ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు అవకాశం లేకుండా పోయింది. పేదలకు పనులు లేకపోవడంతో ఈ నెల 29 నుంచి రేషన్ పంపిణీ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తొలి రోజు రేషన్ దుకాణాల ముందు ప్రజలు పడిగాపులు పడాల్సి వచ్చింది. ప్రతి కుటుంబానికి 5 కేజీల బియ్యం, కేజీ కందిపప్పు ఇస్తామని అధికారులు ప్రకటించడంతో ఆదివారం తెల్లవారుజాము నుంచే కార్డుదారులు డిపోల వద్ద పడిగాపులు పడ్డారు. ఈ పోస్ విధానం వల్ల రేషన్ పంపిణీలో జాప్యం జరుగుతోందని భావించి, ఆ విధానాన్ని పక్కన పెట్టి సంతకాలు తీసుకుని సరుకు పంపిణీ చేయాలని నిర్ణయించినా డిపోల వద్ద సరుకు పంపిణీ లో జాప్యం కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తొలుత ఇంటివద్దకే వాలంటీర్లు వచ్చి సరుకులు పంపిణీ చేస్తారని, రూ.వెయ్యి నగదు అందజేస్తామని సీఎం జగన్ మోహన్ రెడ్డి చెప్పారు. ఎప్పుడు ఈ నెల 28వ తేదీన మాత్రం అధికారులు రేషన్ డిపోల వద్దకే వచ్చి సరుకులు తీసుకోవాలని సూచించారు. వచ్చే నెల 14వ తేదీ వరకు రేషన్ పంపిణీ జరుగుతుందని అధికారులు ప్రకటించినా ఆదివారం ఒక్క రోజే రేషన్ పంపిణీ జరుగుతుందని పుకార్లు షికార్లు చేయడంతో అధిక సంఖ్యలో ప్రజలు రేషన్ డిపోల తరలి వచ్చారు. మధ్యాహ్నం 1 గంట వరకు ఎండలో అవస్థల పాలయ్యారు. గుంటూరు జిల్లా మెడికొండూరులో డిపో వద్దకు 6 గంటలకే కార్డుదారులు చేరుకున్నా అధికారులు రాలేదంటూ చాలా సమయం రేషన్ పంపిణీ చేయలేదు. కార్డుదారులు ఎండలో ఇక్కట్లు పడుతున్నా తాగునీరు సైతం ఏర్పాటు చేయలేదు. కొన్ని డిపోల వద్ద సామాజిక దూరం పాటించలేదు. అధికారులు మాత్రం సామాజిక దూరం పాటించేందుకు ముగ్గుతో మార్కింగ్, హాండ్స్ వాష్, తాగునీరు ఇతర ఏర్పాట్లు చేస్తామని చెప్పినా క్షేత్రస్థాయిలో అమలు కాలేదు. కృష్ణా జిల్లాలో జిల్లా కేంద్రమైన మచిలీపట్నం సర్కిల్ పేట డిపోలో ఎండకు తాళలేక వెంట తెచ్చుకున్న సంచిలను కార్డుదారులు క్యూలో పెట్టారు. ఈ రోజు మధ్యాహ్నం వరకూ 15.10 లక్షల మందికి రేషన్ పంపిణీ చేశారు. రాష్ట్రంలో మొత్తం 1.47 కోట్ల కార్డులు ఉన్నట్లు అధికారులు చెప్పారు. ఈ విషయంలో ప్రభుత్వ వైఫల్యం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం ట్విట్టర్ వేదికగా తప్పుబట్టారు.