కరోనాపై గుడ్‌న్యూస్ చెప్పిన మంత్రి కేటీఆర్

దేశంలో కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. తాజాగా దేశంలో 1,099 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా 27మంది మృతిచెందాడు. 90మంది రికవరీ అయినట్లు తెలుస్తోంది. అదేవిధంగా తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు 70కి చేరింది. కాగా ఇదులో 11మందికి తాజా రిపోర్టులో నెగిటివ్ వచ్చిందని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఈ విషయాన్ని మీతో పంచుకోవడానికి సంతోషంగా ఉందని ఆయన ట్వీట్ చేశారు. కరోనా మహమ్మరిని తెలంగాణ ప్రభుత్వం ఎదుర్కొనేందుకు అన్నివిధలా సన్నద్ధంగా ఉందని పేర్కొన్నారు. అదేవిధంగా […]

Written By: Neelambaram, Updated On : March 29, 2020 8:49 pm
Follow us on

దేశంలో కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. తాజాగా దేశంలో 1,099 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా 27మంది మృతిచెందాడు. 90మంది రికవరీ అయినట్లు తెలుస్తోంది. అదేవిధంగా తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు 70కి చేరింది. కాగా ఇదులో 11మందికి తాజా రిపోర్టులో నెగిటివ్ వచ్చిందని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఈ విషయాన్ని మీతో పంచుకోవడానికి సంతోషంగా ఉందని ఆయన ట్వీట్ చేశారు.

కరోనా మహమ్మరిని తెలంగాణ ప్రభుత్వం ఎదుర్కొనేందుకు అన్నివిధలా సన్నద్ధంగా ఉందని పేర్కొన్నారు. అదేవిధంగా తెలంగాణలో కరోనా బాధితులకు చికిత్సను అందించేందుకు కింగ్‌కోఠిలో 350 పడకల ఆసుపత్రిని పూర్తి అధునాతనంగా సిద్ధం చేసినట్లు మంత్రి ఫొటోలతో సహా షేర్ చేశారు. అలాగే హైదరాబాద్‌లోని నాలుగు ఆసుపత్రుల్లో కరోనా బాధితులకు వైద్య సేవలు అందిస్తున్నట్లు మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.

తెలంగాణలోని జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో నడుస్తున్న అన్నపూర్ణ క్యాంటీన్లలో ప్రతీఒక్కరికి మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం ఉచితంగా అందించనున్నట్లు కేటీఆర్ తెలిపారు. శనివారం మధ్యాహ్నం 30వేల మందికి మధ్యాహ్న భోజనం, 7,500 మందికి రాత్రి భోజనం అందించినట్లు తెలిపారు. 50అన్నపూర్ణ క్యాంటీన్లలో ఉచితంగా భోజనం అందించనున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు.

తెలంగాణ ప్రభుత్వానికి ప్రజలు అన్నివిధలా సహకరించాలని కోరారు. వైద్యుల సూచనలు పాటిస్తే ప్రజలందరూ ఇళ్లకే పరిమితం కావాలని కోరారు. ప్రజలు స్వీయనియంత్రణ పాటిస్తే కరోనా రాకుండా అరికట్టవచ్చన్నారు. తద్వారా సమాజాన్ని కూడా కాపాడుకోవచ్చని తెలిపారు. కరోనా ఇబ్బంది కొన్ని రోజులే ఉంటుందని త్వరగా ఈ క్రైసిస్ పోతుందని కేటీఆర్ చెప్పారు.