పాత బస్తీలో ఢిల్లీ తరహా అల్లర్లకు పన్నాగం!

గత నెల చివరిలో ఢిల్లీలో జరిగిన అల్లర్ల తరహాలో హైదరాబాద్ లోని పాతబస్తీలో కూడా జరపడం కోసం పన్నాగం పన్నారా? కొందరు దుండగులు అటువంటి ప్రయత్నం చేశారని, అయితే వారు వేసిన బాంబులు పేలక పోవడంతో అనుకున్నట్లు జరగలేదని అల్లాస్యంగా పోలీస్ దర్యాప్తులో వెల్లడైంది. ఈ మధ్య పాతబస్తీలో రెండు దేవాలయాలను లక్ష్యంగా చేసుకుని కిరోసిన్ బాంబులతో జరిగిన దాడి అటువంటి ప్రయత్నమే అని నిర్ధారణకు వస్తున్నారు. అయితే ఆ బాంబులు పేలకపోవడంతో వారి కుట్ర విఫలమైన్నట్లు […]

Written By: Neelambaram, Updated On : March 31, 2020 3:20 pm
Follow us on

గత నెల చివరిలో ఢిల్లీలో జరిగిన అల్లర్ల తరహాలో హైదరాబాద్ లోని పాతబస్తీలో కూడా జరపడం కోసం పన్నాగం పన్నారా? కొందరు దుండగులు అటువంటి ప్రయత్నం చేశారని, అయితే వారు వేసిన బాంబులు పేలక పోవడంతో అనుకున్నట్లు జరగలేదని అల్లాస్యంగా పోలీస్ దర్యాప్తులో వెల్లడైంది.

ఈ మధ్య పాతబస్తీలో రెండు దేవాలయాలను లక్ష్యంగా చేసుకుని కిరోసిన్ బాంబులతో జరిగిన దాడి అటువంటి ప్రయత్నమే అని నిర్ధారణకు వస్తున్నారు. అయితే ఆ బాంబులు పేలకపోవడంతో వారి కుట్ర విఫలమైన్నట్లు భావిస్తున్నారు.

ఈ విషయమై పది రోజుల పాటు తీవ్రంగా శ్రమించి ఇద్దరు యువకులను పట్టుకున్న సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్, మాదన్నపేట్ పోలీసుల దృష్టికి విస్మయం కలిగించే అంశాలు వచ్చిన్నట్లు తెలుస్తున్నది. బాంబులు వేసి మతఘర్షణలు సృష్టించేందుకు నిందితులు నాలుగు రోజుల పాటు వివిధ ప్రాంతాల్లో రెక్కి నిర్వహించిన్నట్లు కూడా వెలుగులోకి వచ్చింది.

ముష్కరులు అక్టీవా వాహనంపై తమ వెంట తెచ్చుకున్న కిరోసిన్ బాంబులకు లైటర్ తో నిప్పు పెట్టి దేవాలయం పై పడేసి పరారయ్యారు. ఈ ఘటన దర్యాప్తులో సీసీ కెమెరా ఫుటేజీలు కీలకంగా మారాయి.

ఓ పక్క కరోనా లాక్ డౌన్ ను అమలు చేస్తూనే ఈ దర్యాప్తును సవాల్ గా తీసుకున్న పోలీసులు కిరోసిన్ బాంబు కేసును ఛేదించారు. నిందితులు మాదన్నపేట్ పోచమ్మ దేవాలయంపై మూడు కిరోసిన్ బాంబులు విసిరినట్లు దర్యాప్తులో వెల్లడైనది.

నిందితుల్లో ఒక్కరు రియసత్ నగర్ కు చెందిన హర్షద్ కాగా, మరొకరు బాబా నగర్ కు చెందిన వసిలుగా గుర్తించి అరెస్టు చేశారు. వీరిలో హర్షద్ తీవ్రవాద సంస్థలలో శిక్షణ తీసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటన వెనుక నిషేధిత మతతత్వ, ఉగ్రవాద సంస్థల హస్తం ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.