https://oktelugu.com/

తెలంగాణలో కరోనా ఆసుపత్రులు ఇవే..

తెలంగాణలో కరోనా కట్టడికి ప్రభుత్వం లాక్డౌన్ చేపట్టిన సంగతి తెల్సింది. దీంతో ప్రజారవాణా, వ్యాపార, వాణిజ్య సంస్థలు పూర్తి స్తంభించిపోయాయి. ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. ప్రభుత్వం చర్యలతో కరోనా కొంతమేర కట్టడి అయింది. అయితే రోజురోజుకు కరోనా కేసులు పెరిగిపోతుండటం ఆందోళన రేకెత్తిస్తుంది. తెలంగాణలో తాజాగా 76కరోనా పాజిటివ్ కేసులు నమోదుగా ఆరుగురు మృతిచెందారు. 13మంది రికవరీ అయ్యారు. ఈ నేపథ్యంలో కరోనా బాధితులకు చికిత్సలు అందించేందుకు తెలంగాణలోని పలు ఆసుప్రతులను వినియోగించుకునేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. […]

Written By: , Updated On : March 31, 2020 / 03:05 PM IST
Follow us on

తెలంగాణలో కరోనా కట్టడికి ప్రభుత్వం లాక్డౌన్ చేపట్టిన సంగతి తెల్సింది. దీంతో ప్రజారవాణా, వ్యాపార, వాణిజ్య సంస్థలు పూర్తి స్తంభించిపోయాయి. ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. ప్రభుత్వం చర్యలతో కరోనా కొంతమేర కట్టడి అయింది. అయితే రోజురోజుకు కరోనా కేసులు పెరిగిపోతుండటం ఆందోళన రేకెత్తిస్తుంది. తెలంగాణలో తాజాగా 76కరోనా పాజిటివ్ కేసులు నమోదుగా ఆరుగురు మృతిచెందారు. 13మంది రికవరీ అయ్యారు. ఈ నేపథ్యంలో కరోనా బాధితులకు చికిత్సలు అందించేందుకు తెలంగాణలోని పలు ఆసుప్రతులను వినియోగించుకునేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

రాష్ట్రంలోని గాంధీ ఆసుపత్రి సహా మరో 12ఆసుప్రతులను ప్రత్యేకంగా కరోనా బాధితులకు చికిత్స అందించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ ఆసుపత్రుల్లో కేవలం కరోనా అనుమానితులు, కరోనా రోగులను మాత్రమే చేర్చుకోనున్నారు. మిగతావారిని ఇతర ఆసుప్రతులకు రెఫర్ చేయనున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో హైదరాబాద్లో 9, రంగారెడ్డిలో ఒకటి, వరంగల్లో రెండు కరోనా ఆసుప్రతులు పని చేయనున్నాయి.

కరోనా ఆసుప్రతుల లిస్టు..
హైదరాబాద్ లోని కింగ్ కోఠి ఆసుప్రతి, గాంధీ ఆసుప్రతి, చెస్ట్ హాస్పిటల్, సరోజినిదేవీ ఆసుప్రతి, ఫీవర్ ఆసుప్రతి, బేగంపేటలోని నేచర్ క్యూర్ ఆస్పత్రి, చార్మినార్లోని నిజామియా జనరల్ ఆసుపత్రి, ఎర్రగడ్డలోని ఆయుర్వేద ఆసుపత్రి, రామంతాపూర్లోని హోమియో ఆసుపత్రులు ఉన్నాయి. అదేవిధంగా రంగారెడ్డిలోని గచ్చిబౌలి స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను కరోనా ఆసుప్రతిగా మార్చుతున్నారు. వరంగల్లోని ఎంజీఎం, ప్రభుత్వ ఆయుర్వేద బోధనాస్పత్రులను కరోనా ఆసుప్రతులుగా వినియోగించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.