ఢిల్లీ నుంచి వచ్చిన వారు క్వారంటైన్ కు

కరోనా వైరస్ కు సంబంధించి కొత్తగా 17 కేసులు నమోదవడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. కోవిడ్-19 బాధితుల సంఖ్య పెరగడానికి రాష్ట్ర వాసులు ఈ నెల మూడవ వారంలో డిల్లీలో జరిగిన తబ్లీగీ జమాత్ కార్యక్రమంలో పాల్గొనడమే. అక్కడికి వెళ్లి వచ్చిన వారిలో ఎక్కువ మందిలో కరోనా లక్షణాలు కనిపిస్తున్నాయి. దీనితో ఈ కార్యక్రమానికి వెళ్లిన రాష్ట్ర వాసులు వివరాలు ఇప్పటికే సేకరించిన ప్రభుత్వం వారిని క్వారంటైన్ కు పంపాలని జిల్లా కలెక్టర్ లను ఆదేశించింది. […]

Written By: Neelambaram, Updated On : March 31, 2020 4:21 pm
Follow us on

కరోనా వైరస్ కు సంబంధించి కొత్తగా 17 కేసులు నమోదవడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. కోవిడ్-19 బాధితుల సంఖ్య పెరగడానికి రాష్ట్ర వాసులు ఈ నెల మూడవ వారంలో డిల్లీలో జరిగిన తబ్లీగీ జమాత్ కార్యక్రమంలో పాల్గొనడమే. అక్కడికి వెళ్లి వచ్చిన వారిలో ఎక్కువ మందిలో కరోనా లక్షణాలు కనిపిస్తున్నాయి. దీనితో ఈ కార్యక్రమానికి వెళ్లిన రాష్ట్ర వాసులు వివరాలు ఇప్పటికే సేకరించిన ప్రభుత్వం వారిని క్వారంటైన్ కు పంపాలని జిల్లా కలెక్టర్ లను ఆదేశించింది. ఈ అంశంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఢిల్లీ వెళ్లి వచ్చిన వారంతా స్వచ్చందంగా వారి వివరాలు అధికారులకు తెలపాలని సూచించారు. వ్యాధి లక్షణాలు ఉన్న వారిని హాస్పిటల్ క్వారంటైన్లోను, లక్షణాలు కనిపించని వారిని హోమ్ క్వారంటైన్, ఐసోలేషన్లో ఉంచాలన్నారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని ఆ శాఖ ఆధికారుల మాట్లాడారు. ఢిల్లీలో జరిగిన తబ్లీగీ జమాత్‌ సదస్సుకు హాజరైనవారు, వారి కుటుంబ సభ్యులకు వెంటనే వైద్య పరీక్షలు నిర్వహించాలన్నారు. మరోవైపు ఆన్నీ జిల్లాల కలెక్టర్ లు అప్రమత్తమై రాష్ట్రంనుంచి వెళ్లిన వారు, అదేరోజు రైల్లో ప్రయాణం చేసిన వారి వివరాల ప్రకారం ఆ వ్యక్తులను గుర్తించేందుకు చర్యలు చేపట్టారు. గుంటూరులో జిల్లాలో 180 మందిలో 140 మందిని గుర్తించారు. 103 కేసులు చెక్ చేశారు, అందులో ఐదుగురికి పాజిటివ్ గా వ‌చ్చింది. మిగిలిన 40 మంది కోసం వెతుకుతున్నారు. ఢిల్లీలో మీటింగ్‌కి వెళ్లినవారితో పాటు వారి కుటుంభ సభ్యులకు పాజిటివ్ రిపోర్టులు వచ్చాయి.

ఢిల్లీ వెళ్లి వచ్చిన వారు స్వచ్చందంగా టెస్ట్ చేయించుకోవాలి.. అలా కాకుండా మాకు పట్టుబడితే కఠినంగా చర్యలు ఉంటాయని కలెక్టర్ లు ప్రకటించారు. అనంతపురం జిల్లాలో 73 మందిని గుర్తించారు. ఒకరి ఆచూకీ లభ్యం కాలేదు. మరొకరు ఢిల్లీలోనే ఉన్నట్లు తెలిసిందని అధోకారులు చెబుతున్నారు. ఇతర జిల్లాల్లోని అధికారులు వీరిని గుర్తించే పనిలో ఉన్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన వారి అడ్రసులు, ఫోన్ నెంబర్లు సేకరించడంతో వారిని కనుగొనడం తేలికయ్యింది.