https://oktelugu.com/

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఎ కోత

కరోనా మహమ్మారిని చూపి అన్ని వర్గాలపై పెద్ద ఎత్తున ఆర్ధిక చెల్లింపులలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భారీ కోతలు విధిస్తున్నాయి. ప్రజాప్రతినిధుల జీత, భత్యాలపై కొత్త విధించిన కేంద్రం తాజాగా ఉద్యోగులకు చెల్లించే డిఎ పెంపుదలపై ఆంక్షలు విధించింది. ఇప్పటికే పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగుల జీతాలతో 50 శాతం మేరకు కోతలు విధించడం తెలిసిందే. ఉద్యోగులకు డీఏ (డియర్నెస్ అలవెన్స్) చెల్లింపులను కేంద్రం వాయిదా వేసింది. 4 శాతం నుంచి 12 శాతానికి పెంచుతూ మార్చి […]

Written By:
  • Neelambaram
  • , Updated On : April 23, 2020 / 02:43 PM IST
    Follow us on


    కరోనా మహమ్మారిని చూపి అన్ని వర్గాలపై పెద్ద ఎత్తున ఆర్ధిక చెల్లింపులలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భారీ కోతలు విధిస్తున్నాయి.

    ప్రజాప్రతినిధుల జీత, భత్యాలపై కొత్త విధించిన కేంద్రం తాజాగా ఉద్యోగులకు చెల్లించే డిఎ పెంపుదలపై ఆంక్షలు విధించింది. ఇప్పటికే పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగుల జీతాలతో 50 శాతం మేరకు కోతలు విధించడం తెలిసిందే.

    ఉద్యోగులకు డీఏ (డియర్నెస్ అలవెన్స్) చెల్లింపులను కేంద్రం వాయిదా వేసింది. 4 శాతం నుంచి 12 శాతానికి పెంచుతూ మార్చి 13 నాటి కేంద్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం అమలును వాయిదా వేసింది. తద్వారా కేంద్ర ఖజానాపై 2020-21 ఆర్థిక సంవత్సరానికి సుమారు రూ 27,000 కోట్ల భారాన్ని తగ్గించుకోనుంది. 2020 జనవరి 1 నుంచి జూన్ వరకు ఇది వర్తిస్తుందని ప్రభుత్వంప్రకటించింది.

    ఈ నిర్ణయంతో సుమారు 49.26 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 61.17 లక్షల మంది పెన్షనర్లను ప్రభావితం చేస్తుంది.పెరుగుతున్నధరల కనుగుణంగా దీన్ని సంవత్సరానికి రెండుసార్లు సవరిస్తారు. తదుపరి సమీక్ష జూలైలో ఉండనుంది

    కరోనా సంక్షోభం, మార్చి 24 నుంచి లాక్ డౌన్ అమలవుతున్న కారణంగా పన్నుల నుండి వచ్చే ఆదాయం తగ్గిపోయింది. ఉత్పత్తుల ఖర్చులు పెరిగాయి. నిధుల కొరత నేపధ్యంలో ప్రభుత్వం ఎక్కువగా ఖర్చులను తగ్గించుకుంటోంది. అన్ని శాఖలకు కేటాయించిన బడ్జెట్‌లో 40 శాతం కోత విధిస్తూ నిర్ణయం తీసుకుంది.

    ప్రధాన మంత్రి, మంత్రులు, అధ్యక్షుడు, పార్లమెంటు సభ్యుల జీతాలను ప్రభుత్వం ఇప్పటికే 30 శాతం తగ్గించింది. ఎంపీ లాడ్స్ నిధులను కూడా రెండు సంవత్సరాలు నిలిపివేసింది.

    దీంతోపాటు కరోనా బాధితులను, నష్టపోయిన ప్రజానీకాన్ని ఆదుకునేందుకుగాను కేంద్ర ప్రభుత్వోద్యోగుల (రెవెన్యూ శాఖ) ఒక రోజు వేతనాన్ని కోత విధించి ఈ నిధులను పీఎం కేర్స్‌ జాతీయనిధికి జమ చేయాలని కేంద్రం ఇప్పటికే నిర్ణయించింది.