https://oktelugu.com/

కర్నూలు వైద్యుడి కుటుంబంలో ఆరుగురికి కరోనా!

కర్నూలులో కరోనా వైరస్ అంతకంతకూ విస్తరిస్తూనే ఉంది. పట్టణంలో 13 కేసులు నమోదు కాగా, వీటిలో ఆరు కేసులు ఇటీవల కరోనాతో మరణించిన ఓ ప్రైవేటు ఆసుపత్రి వైద్యుడి కుటుంబ సభ్యులవే కావడం గమనార్హం. అదేవిధంగా కర్నూలు సర్వజన ఆసుపత్రిలో పనిచేస్తున్న ఓ వైద్యురాలికి వైరస్ సోకినట్టు అధికారులు తెలిపారు. వ్యాధుని కుటుంబ సభ్యులతో పాటు ఆయన దగ్గర వైద్యం చేయించుకున్న వారందరినీ గుర్తించే చర్యలు అధికారులు ఇప్పటికే ప్రారంభించారు. సుమారు 1,500 మంది వరకూ పరిసర […]

Written By: , Updated On : April 18, 2020 / 12:05 PM IST
Follow us on


కర్నూలులో కరోనా వైరస్ అంతకంతకూ విస్తరిస్తూనే ఉంది. పట్టణంలో 13 కేసులు నమోదు కాగా, వీటిలో ఆరు కేసులు ఇటీవల కరోనాతో మరణించిన ఓ ప్రైవేటు ఆసుపత్రి వైద్యుడి కుటుంబ సభ్యులవే కావడం గమనార్హం. అదేవిధంగా కర్నూలు సర్వజన ఆసుపత్రిలో పనిచేస్తున్న ఓ వైద్యురాలికి వైరస్ సోకినట్టు అధికారులు తెలిపారు.

వ్యాధుని కుటుంబ సభ్యులతో పాటు ఆయన దగ్గర వైద్యం చేయించుకున్న వారందరినీ గుర్తించే చర్యలు అధికారులు ఇప్పటికే ప్రారంభించారు. సుమారు 1,500 మంది వరకూ పరిసర ప్రాంతాలకు చెందిన వారు ఇతని వద్ద వైద్యం చేయించుకున్నట్లు తెలుస్తోంది. ఆసుపత్రి ఓ.పి రికార్డులను పరిశీలించి వైద్యం చేయించుకున్న వారి వివరాలను అధికారులు సేకరించారు. మరోవైపు కరోనా పాజిటివ్ నిర్దారణ అయిన వైద్యుడు వద్ద చికిత్స చేయించుకున్న వారు తమ వివరాలను సమీపంలోని అధికారులకు తెలియజేయాలని కోరుతూ బహిరంగ ప్రకటన జారీ చేశారు.

రాష్ట్రం మొత్తం కేసుల్లో 44 శాతం వరకు గుంటూరు, కర్నూలు జిల్లాలలోనే నమోదు కావడం గమనార్హం. ఇక్కడి పరిస్థితిని అదుపులోకి తెచ్చి, వైరస్ వ్యాప్తిని కట్టుదిట్టంగా అమలు చేయాలని అధికారులు చర్యలు చేపడుతున్నా రెండు జిల్లాల్లో కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి.