https://oktelugu.com/

ఏపీలో ఇక రంగా, అంబేద్కర్‌‌ విగ్రహాల రాజకీయం

ఏపీలో నిన్నా మొన్నటివరకు దేవాలయాలపై దాడులు.. విగ్రహాల విధ్వంసం రాజకీయం నడిచింది. అధికార, ప్రతిపక్షాల ఆరోపణలు, ప్రత్యారోపణలతో రాజకీయ దుమారమే రేపారు. తాజాగా.. రంగా, అంబేద్కర్‌‌ విగ్రహాల పేరిట జరుగుతున్న రాజకీయం తెరమీదకు వచ్చింది. వైఎస్ఆర్ సీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లో రంగా, అంబేద్కర్ విగ్రహాలపై దాడులు చేయడానికి టీడీపీ వ్యూహం పన్నింది అని తమ వద్ద స్పష్టమైన సమాచారం ఉందని పేర్కొన్నారు. టీడీపీ అంతర్గత సమావేశాల్లో ఈ మేరకు వ్యూహ రచన జరిగిందని, […]

Written By:
  • Srinivas
  • , Updated On : February 4, 2021 3:58 pm
    Follow us on

    Ranga and Ambedkar statues
    ఏపీలో నిన్నా మొన్నటివరకు దేవాలయాలపై దాడులు.. విగ్రహాల విధ్వంసం రాజకీయం నడిచింది. అధికార, ప్రతిపక్షాల ఆరోపణలు, ప్రత్యారోపణలతో రాజకీయ దుమారమే రేపారు. తాజాగా.. రంగా, అంబేద్కర్‌‌ విగ్రహాల పేరిట జరుగుతున్న రాజకీయం తెరమీదకు వచ్చింది. వైఎస్ఆర్ సీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లో రంగా, అంబేద్కర్ విగ్రహాలపై దాడులు చేయడానికి టీడీపీ వ్యూహం పన్నింది అని తమ వద్ద స్పష్టమైన సమాచారం ఉందని పేర్కొన్నారు. టీడీపీ అంతర్గత సమావేశాల్లో ఈ మేరకు వ్యూహ రచన జరిగిందని, పార్టీ అంతర్గత వర్గాల నుంచే తమకు సమాచారం వచ్చిందని ఆయన పేర్కొన్నారు.

    Also Read: చంద్రబాబు కొత్త అడుగులు.. బ్రేక్ వేసిన అమిత్ షా..?

    ఇంటెలిజెన్స్ రిపోర్టులు కూడా ఇదే విషయాన్ని ధ్రువీకరిస్తున్నాయని అన్నారు. వైఎస్ఆర్ సీపీ మరో నేత అంబటి రాంబాబు మాట్లాడుతూ.. ‘రంగా అంబేద్కర్ విగ్రహాలు ధ్వంసం చేస్తే వాళ్ల అభిమానులు రెచ్చిపోతారు. వాళ్ళు వీళ్ళు కొట్టుకుంటే రాష్ట్రంలో అలజడి రేగుతుంది. దీనిని ఆధారం చేసుకుని రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయడానికి చంద్రబాబు వ్యూహం పన్నారు’ అని వ్యాఖ్యానించారు. అయితే వైఎస్ఆర్సీపీ చేస్తున్న ఆరోపణలను టీడీపీ నేతలు తిప్పికొట్టారు.

    ఈ మేరకు టీడీపీ నేత బోండా ఉమ మాట్లాడుతూ.. వైఎస్ఆర్సీపీ రహస్య ఎజెండానే సజ్జల రామకృష్ణారెడ్డి బయటపెట్టారని అన్నారు. రంగా అంబేద్కర్‌‌ల విగ్రహాలు వైఎస్ఆర్సీపీయే ధ్వంసం చేయించి, ఆ నెపాన్ని టీడీపీ మీదకు తోయాలని.. తమ అసమర్థ పాలన నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి వైకాపా ప్రయత్నిస్తోందని అన్నారు. ఒకవేళ నిజంగా రంగా, అంబేద్కర్ విగ్రహాలపై దాడులు జరిగితే వైఎస్ఆర్సీపీ అంతు చూస్తామని హెచ్చరించారు.

    Also Read: తెలంగాణ ప్రభుత్వంపై గవర్నర్‌‌ ఫైర్‌‌..: బీజేపీ ప్లాన్‌ అదేనా..?

    మరొక టీడీపీ నేత జ్యోతుల నెహ్రూ కూడా ఇదే విషయంపై స్పందించారు. ఆయన కాస్త విశ్లేషణాత్మకంగా, భిన్నంగా స్పందించారు. కాపులు ఆరాధ్య దైవంగా భావించే రంగా విగ్రహాన్ని, దళితులు ఆరాధ్య దైవంగా భావించే అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసి, ఆ నెపాన్ని టీడీపీ మీదకు వేయడం ద్వారా ఆ రెండు వర్గాల ఓట్లను వైఎస్సార్సీపీ వైపు పోలరైజ్‌ అయ్యేలా చేసుకునే కుట్ర, వ్యూహం దీని వెనకాల ఉన్నాయని జ్యోతుల నెహ్రూ విశ్లేషించారు. ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు ఎత్తులు పైఎత్తులతో హాట్‌హాట్‌గా కొనసాగుతున్నాయి. ఎవరి ఆరోపణల్లో ఏ మేరకు నిజం ఉందో కాలమే నిర్ణయించాలి మరి.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్