చాలామంది వంటల్లో తెల్ల ఉప్పును వినియోగిస్తారనే సంగతి తెలిసిందే. అయితే కొంతమంది మాత్రం తెల్ల ఉప్పుకు బదులుగా వంటల్లో నల్ల ఉప్పును కూడా వినియోగిస్తారు. గతంతో పోలిస్తే నల్ల ఉప్పు వాడకం తగ్గినా వంటల్లో ఈ ఉప్పును వినియోగించడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. నల్ల ఉప్పులో చర్మ సౌందర్యాన్ని పెంచే గుణాలు కూడా ఉన్నాయి. నల్ల ఉప్పు శరీరం ఇన్ఫెక్షన్లు, సూక్ష్మక్రిముల బారిన పడకుండా రక్షిస్తుంది.
Also Read: ఇంగువ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు మీకు తెలుసా..?
మలబద్ధకం సమస్యతో బాధ పడేవాళ్లు నల్ల ఉప్పు కలిపిన నీటిని తాగితే ఆ సమస్య దూరమవుతుంది. నల్ల ఉప్పు తీసుకోవడం వల్ల గ్యాస్ సమస్యలకు కూడా సులభంగా చెక్ పెట్టవచ్చు. మహిళలు శిరోజాలకు నల్ల ఉప్పును పట్టిస్తే జుట్టు ఆరోగ్యంగా ఉండటంతో పాటు నిగ నిగలాడుతుంది. చాలామంది చర్మం పగుళ్ల వల్ల ఇబ్బందులు పడుతూ ఉంటారు. బకెట్ నీళ్లలో కొద్దిగా నల్ల ఉప్పు వేసి ఆ నీటిలో పాదాలను పావుగంట సమయం ఉంచి స్క్రబ్ చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
Also Read: పుచ్చకాయ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా..?
సహజసిద్ధమైన స్క్రబ్బర్ అయిన నల్ల ఉప్పును చర్మంపై సున్నితంగా రుద్ది స్నానం చేస్తే బ్లాక్ హెడ్స్ రావడం, చర్మం పొడిబారడం, మొటిమలు పోవడం జరుగుతుంది. చుండ్రు సమస్యకు చెక్ పెట్టడంలో నల్ల ఉప్పు సహాయపడుతుంది. నల్ల ఉప్పును జుట్టుకు రుద్దుకుని పది నిమిషాల తరువాత తల స్నానం చేస్తే చండ్రు సమస్య దూరమవుతుంది. పండ్ల రసాలలో కొద్దిగా నల్ల ఉప్పు వేసుకుని తాగితే అనారోగ్య సమస్యలు దూరమవుతాయి.
మరిన్ని వార్తలు కోసం: ఆరోగ్యం/జీవనం
గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధ పడేవాళ్లు నీళ్లలో నల్ల ఉప్పు కొద్దిగా కలుపుకుని తాగితే మంచి ఫలితం ఉంటుంది. అసిడిటీ, కడుపు ఉబ్బరం, కడుపులో మంట సమస్యలకు చెక్ పెట్టడంలో నల్ల ఉప్పు సహాయపడుతుంది.