జగన్ తీసుకున్న సంచలమైన నిర్ణయం అమరావతి ప్రాంతాన్ని కుదిపివేస్తుంది. పైన ఉన్న జగన్ బాగానే ఉన్నారు కానీ కింద ఉన్న నాయకులకు మాత్రం ఇది పెద్ద సమస్యగా మారింది. వారికి అడుగడుగునా చేదు అనుభవాలే ఎదురవుతున్నాయి. ఈరోజు మాచర్ల ఎమ్మల్యే రామకృష్ణ రెడ్డిని నడి రోడ్డుపై ఆపి అతని సెక్యూరిటీని కొట్టారు. అంతటితో ఆగకుండా ఎమ్మల్యేకి హాని చేసే క్రమంలో కారును ధ్వంసం చేసారు. అయన పోలీసుల సహాయంతో అక్కడనుండి పరారయ్యారు.
ఎమ్మెల్యేని కొట్టే పరిస్థితి ఎందుకు వచ్చిందని ఒక్కసారి అన్వేషిస్తే మనకి కొన్ని నిజాలు కళ్ళముందే కనిపిస్తాయి. జగన్ మూడు రాజధానుల ప్రతిపాదన చేసినప్పటినుంచి రాష్టం మొత్తం అయోమయంలో పడింది. రాజధాని ఎక్కడ వస్తుందని ఎవరికీ స్పష్టమైన అవగాహన లేదు. నిజం చెప్పాలంటే కొందరు వైసిపి నాయకులకే దీని మీద సరైన సమాచారం లేదు.
జిఎన్ రావు కమిటీ ఇంకా బీసీజీ కమిటీ మూడు రాజధానులకే మొగ్గు చూపిన, అసలైన హై పవర్ కమిటీ ఏమి తెలుస్తుందని సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నది. హై పవర్ కమిటీ కూడా మూడు రాజధానులవైపే మొగ్గు చూపిన ఆశ్ఛర్యపోవాల్సిన పనిలేదు. జగన్ మదిలో ఒకటనుకుంటే కచ్చితంగా సాధించే తీరతాడు. విపక్షాలు ఎన్ని కుయుక్తులు పన్నినా జగన్ నిర్ణయాన్ని మార్చటం ఎవరితరం కాదు. ఒక్క మాట ఇచ్చాడంటే దాని కోసం ఎంత దూరమైన వెళ్తాడు.
మరి అంత గట్టిగ రాజధాని మార్చాలనుకున్నప్పడు ఒక స్పష్టత ఇవ్వటానికి ఎందుకు జంకుతున్నాడో…ఎవరికీ అర్థంకాని పరిస్థితి. అమరావతి ప్రాంతంమొత్తం ప్రభుత్వ వ్యతిరేక నినాదంతో అట్టుడుకుతుంటే, ఎందుకు నాయకులూ ఎవరు స్పష్టమైన ప్రకటన చేయట్లేదో అంతుచిక్కని మర్మం.
అటు విశాఖపట్నం వాళ్ళకి కర్నూలు వాళ్ళకి కూడ తెరెవెనుక ఏదో పెద్ద నాటకం నడుస్తుందనే అనుమానం ఉంది. రాష్ట్రంలో ఏ ప్రాంతం వారికి సరైన సమాధానం లేనపుడు లోలోపల చాల భయాంధోళనలు వెల్లువెత్తుతాయి. చాలామందికి వైసీపీ వాళ్ళు భూముల వేటలో ఉన్నారనే అనుమానం కూడ ఉంది. అమరావతిలో భూములన్ని అమ్ముడుపోయాయి గనుక కొత్త ప్రాంతంలో భూములని వాళ్ళ పేరు కింద సమకూర్చుకునే పనిలో ఉన్నారనే అనుమానం ఉంది. ఏ రాజకీయ పార్టీ అయినా లాభం లేనిదీ పైసా పని కూడా చేయరుకదా…!
మరి ఇన్ని ఆలోచనల మధ్య ప్రజలు అనుకునే ఒకేఒక్క మాట….. “అంతా జగన్నాటకం”.