
చైనాలో పుట్టిన కరోనా వైరస్ రక్కసి ప్రపంచవ్యాప్తంగా అందర్నీ ఆందోళనకు గురి చేస్తోంది. ఈ వైరస్ కారణంగా మంగళవారం నాటికి చైనాలో 130 మంది ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది చికిత్స పొందుతున్నారు. ఈ వైరస్ ఎక్కడ తమ దేశంలోకి ప్రవేశిస్తుందోనని ప్రపంచ దేశాలు ఆందోళనలో ఉన్నాయి. ముందస్తు జాగ్రత్తగా విమానాశ్రయాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ వైరస్ సీఫుడ్ మార్కెట్ నుంచి పుట్టిందని తొలుత చైనా వెల్లడించింది. కానీ చైనా తయారు చేసిన జీవాయుధం (బయో వెపన్) బెడిసికొట్టి.. డ్రాగన్‌నే ఇబ్బందులు పెడుతుందనే కథనం వెబ్ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది.
Read More: కరోనా వైరస్ కలకలం: దాని లక్షణాలు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు
Obviously I’m following the 2019-nCoV #WuhanOutbreak quite closely. I’m not convinced that there is evidence yet to support the theory that this BL-4 R&D facility in #Wuhan is responsible for the #coronavirus outbreak. It’s proximity is interesting though. https://t.co/NngrK67QJO
— Dr. Malcolm Davis (@Dr_M_Davis) January 25, 2020
కరోనా వైరస్ చైనాలోని వుహాన్ లో తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న ప్రాంతానికి 30 కి.మీ. దూరంలోనే వుహాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బయోసేఫ్టీ లాబోరేటరీ ఉండటం అనుమానాలకు తావిచ్చింది. ఇక్కడ ఎబోలా, నిఫా లాంటి ప్రమాదకర వైరస్‌లపై ప్రయోగాలు చేపడతారు.ఈ ల్యాబ్ నుంచే కరోనా వైరస్ బయటకు లీకైందనే వార్త చక్కర్లు కొడుతోంది.
గ్రేట్ గేమ్ ఇండియా అనే ఆన్‌లైన్ పోర్టల్ ప్రకారం.. ఈ వైరస్ మూలాలు కెనడాలో ఉన్నాయి. ‘‘చైనాకు చెందిన ఇద్దరు బయోలాజికల్ వార్‌ఫేర్ ప్రోగ్రాం ఏజెంట్లు ఈ వైరస్‌ను గుట్టు చప్పుడు కాకుండా చైనాకు తీసుకెళ్లారు. ఆ కథనంలో ఇంకేముందంటే.. 2012 జూన్ 13న సౌదీకి చెందిన 60 ఏళ్ల వ్యక్తి ఏడు రోజులపాటు జ్వరం, దగ్గు, శ్వాస సంబంధ సమస్యలతో బాధపడుతూ జెడ్డాలోని ఓ ప్రయివేట్ హాస్పిట్లో చేరాడు. ఆయనకు పొగ అలవాటు లేదు, దీర్ఘకాలికంగా మందులేవీ తీసుకోవడం లేదు. దీంతో ఈజిప్షియన్ వైరాలజిస్ట్ డాక్టర్ అలీ మహ్మద్ జాకీ ఆ పేషెంట్ ఊపిరితిత్తుల్లో కరోనా వైరస్ ఆనవాళ్లు ఉన్నాయని అనుమానించాడు. నెదర్లాండ్స్‌లోని ఎరాస్మస్ మెడికల్ సెంటర్‌లో వైరాలజిస్ట్‌గా పని చేసే రోన్ ఫౌఛిర్‌ను సంప్రదించాడు.
జాకీ పంపిన శాంపిల్‌ను పరీక్షించిన ఫౌచిర్ ఓ శాంపిల్‌ను కెనడాలోని నేషనల్ మైక్రోబయాలజీ ల్యాబ్‌లో పని చేసే డాక్టర్ ఫ్రాంక్ ప్లమ్మర్‌కు అందజేశాడు. ఇక్కడి ల్యాబ్ నుంచి చైనా ఏజెంట్లు వైరస్‌ను తస్కరించారు. 2019 మార్చిలో అనుమానాస్పద వస్తువు ఒకటి కెనడా ల్యాబ్ నుంచి చైనాకు వెళ్లింది. విచారణలో చైనీస్ వైరాలజిస్టులు దీన్ని కెనడా ల్యాబ్ నుంచి పంపించారని తేలింది’’ అని ఆ కథనం చెబుతోంది.
Read More: కరోనా వైరస్ సోకి మలేషియాలో చనిపోయిన భారతీయుడు
భారత్‌ను దెబ్బతీయడం కోసమే చైనా ఈ జీవాయుధాన్ని తయారు చేసిందని… కానీ అది లీకై డ్రాగన్‌కే ముప్పుగా పరిణమించిందనే కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. చైనా ల్యాబ్‌ల్లో జీవాయుధం తయారు చేస్తుండొచ్చని ఇజ్రాయెల్ లెఫ్టినెంట్ కల్నల్ అనుమానం వ్యక్తం చేశారు. ఆయన మెడికల్ మైక్రోబయాలజీ నుంచి డాక్టరేట్ పొందారు. కెనడా నుంచి కరోనా వైరస్‌ను చైనా తస్కరించిందనడానికి, జీవాయుధాలు తయారు చేస్తోందనడానికి తగిన ఆధారాలేవీ లేవు.
కరోనా చైనా జీవాయుధం అనడానికి ఎలాంటి ఆధారాలు లేవు కాబట్టి దీనికి వుహాన్‌లో ప్రయోగశాలే కారణమని తాను నమ్మడం లేదని ఆస్ట్రేలియా డిఫెన్స్ అనలిస్ట్ డాక్టర్ మాల్కమ్ డేవిస్ ట్వీట్ చేశారు. కానీ బయో సైన్స్‌లో చైనా భారీ ఎత్తున పెట్టుబడులు పెడుతుండటం, నైతికతకు కట్టుబడి ఉండని దాని వైఖరి అనుమానాలకు తావిస్తోంది. చైనా కరోనా వైరస్ విషయంలో నోరు మెదపకపోవడంతో అనుమనాలు మరింతగా పెరుగుతున్నాయి.
Read More: కరోనా వైరస్.. సోకితే ఈ లక్షణాలు.. సోకకుండా ఈ జాగ్రత్తలు