spot_img
Homeఅంతర్జాతీయంఅందుకే సులేమానీని హత్య చేశాం:ట్రంప్‌

అందుకే సులేమానీని హత్య చేశాం:ట్రంప్‌

జనవరి 3న ఇరాన్‌ లో జరిగిన దాడిపై స్పందించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌. కమాండర్‌ జనరల్‌ ఖాసిం సులేమానీపై దాడిని అధికారికంగా ప్రకటించారు. అమెరికా పౌరులను కాపాడుకోవడంలో భాగంగానే దాడి చేసినట్లు పునరుద్ఘాటించారు. అమెరికా దౌత్యాధికారులు, సైనికులే లక్ష్యంగా సులేమానీ దాడులకు సన్నాహాలు చేస్తున్నట్లు గుర్తించామన్నారు. అందుకే ఆయన్ని హతమార్చాల్సి వచ్చిందని ప్రకటించారు. ఇటీవల బాగ్దాద్‌లోని అమెరికా రాయబార కార్యాలయ ముట్టడి సహా ఇరాక్‌లోని అమెరికా మిత్రపక్షాల సైనిక స్థావరాలపై దాడులకు అతడే సూత్రధారి అని పేర్కొన్నారు. అమెరికా సంకీర్ణ దళాలకు చెందిన వందల మంది సైనికుల మరణాలకు, వేల మంది గాయపడటానికి అతడిదే బాధ్యత అని ఆరోపించారు. న్యూదిల్లీ, లండన్‌లో ఉగ్రదాడులకు ప్రయత్నించారని పేర్కొన్నారు. తమ దౌత్యాధికారులు, సైనికులపై చేయబోయే మరిన్ని దాడులను అడ్డుకోవడానికే తాజాగా దాడి చేశామని సమర్థించుకున్నారు.

ఇరాన్‌లో ప్రభుత్వాన్ని కూల్చే ఆలోచన తమకు లేదన్నారు. ‘‘యుద్ధాన్ని ఆపడం కోసమే తాము ఈ చర్య తీసుకున్నామని.. యుద్ధాన్ని ప్రారంభించడం కోసం కాదు’’ అని ట్రంప్‌ స్పష్టం చేశారు. ఇరాన్‌ ప్రజల పట్ల తమకు అమితమైన గౌరవం ఉందన్నారు. అద్భుతమైన చరిత్ర, అత్యంత సామర్థ్యం ఉన్న వ్యక్తులుగా ఇరాన్‌ ప్రజలను ఆయన అభివర్ణించారు. ఇరాన్‌లో శాంతి సామరస్యం కోరుకునే ప్రజల చేతుల్లోనే ఆ దేశ భవిష్యత్తు ఉందని ట్రంప్‌ వ్యాఖ్యానించారు.

కొన్నాళ్లుగా ఉప్పు నిప్పుగా ఉన్న అమెరికా, ఇరాన్‌ల మధ్య ఒక్కసారిగా అగ్గి రాజుకున్న విషయం తెలిసిందే. శుక్రవారం ఇరాక్‌లో అమెరికా చేపట్టిన డ్రోన్‌ దాడిలో ఇరాన్‌ సైన్యంలోని రివల్యూషనరీ గార్డ్స్‌కు శక్తిమంతమైన కమాండర్‌గా ఉన్న జనరల్‌ ఖాసిం సులేమానీ (62) చనిపోయారు. విదేశాల్లోని తమ సిబ్బందిని రక్షించడానికే ఈ చర్యను చేపట్టామని అమెరికా రక్షణశాఖ ప్రధాన కార్యాలయం పెంటగాన్‌ పేర్కొంది. దీనికి తీవ్ర ప్రతీకారం తప్పదని ఇరాన్‌ హెచ్చరించింది.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Related News

Most Popular

America Politics: అమెరికాకు యువ అధ్యక్షురాలు.. పోల్స్ తో ఈ 36 ఏళ్ల మహిళకే ఓటు

America Politics: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరిగి ఏడాదిన్నర అయింది. నాలుగేళ్లకోసారి ఎన్నికలు జరుగుతాయి. ఏడాదిన్నర క్రితం జరిగిన ఎన్నికల్లో డొనాల్డ్‌ ట్రంప్‌ రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. అంతకుముందు జోబైడెన్‌ అధ్యక్షుడిగా...

Chiranjeevi: చిరంజీవి కెరియర్ లో చేసిన మూడు తప్పులు ఇవే…

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి హీరోగా చేసిన సినిమాలు అతన్ని టాప్ లెవెల్లో నిల్చోబెట్టాయి. ఒక సామాన్య మానవుడు సైతం సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఇక్కడ హీరోగా మారవచ్చు అని ప్రూవ్ చేసిన...

Vijay Deverakonda: విజయ్ దేవరకొండ మూవీ రిలీజ్ పోస్ట్ పోన్ వెనక ఇన్ని కారణాలున్నాయి…

Vijay Deverakonda: 'అర్జున్ రెడ్డి' సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోగా మారిపోయిన నటుడు విజయ్ దేవరకొండ... ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాల విషయంలో చాలా కేర్ ఫుల్ గా...

Ramayana Trailer Postponed: ‘రామాయన్ ‘ ట్రైలర్ విడుదల వాయిదా.. సంచలనం రేపుతున్న పోస్ట్..

Ramayana Trailer Postponed: బాలీవుడ్ లో నితీష్ తివారీ దర్శకత్వం లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన 'రామాయన్' మూవీ కి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ని నేడు గ్రాండ్ గా విడుదల చెయ్యాలని...

Super El Nino: వచ్చే రోజుల్లో సూపర్ ఎల్ నినో.. తెలుగు రాష్ట్రాల్లో ప్రభావం ఎలా ఉంటుందంటే..

Super El Nino: సాంకేతిక పరిజ్ఞానం పెరిగింది. గతంతో పోల్చి చూస్తే వాతావరణం మీద శాస్త్రవేత్తలకు అవగాహన మరింత పెరిగింది. అందువల్లే వర్షాలు.. ఎండలు.. కరువు కాటకాల గురించి అత్యంత స్పష్టంగా...
Oktelugu Epaper
Exit mobile version