PM Modi on H1B visa hike: డొనాల్డ్ ట్రంప్ హెచ్-1బీ వీసాల ఫీజు భారీగా పెంచేశారు. విదేశీ ఉద్యోగులను తగ్గించే ఉద్దేశంతో లక్ష డాలర్లు(రూ.88 లక్షలు) చెల్లించిన వారికే హెచ్-1బీ వీసా జారీ చేసేలా నిబంధనలు మార్చారు. ఈమేరకు ఫైల్‌పై సంతకం చేశారు. దీంతో ఐదేళ్లుగా 70 శాతం హెచ్-1బీ వీసాలు పొందుతున్న భారతీయులపై ఈ ప్రభావం అధికంగా పడనుంది. అమెరికా వెళ్లాలన్న ఐటీ నిపుణుల కల ఇక కలగానే మిగిలిపోనుంది. ఈతరుణంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుజరాత్‌లో జరిగిన బహిరంగ సభలో భారతదేశ అభివృద్ధి మార్గంలో విదేశీ ఆధారితను ప్రధాన అడ్డంకిగా గుర్తించారు. దేశం “విశ్వబంధు” స్ఫూర్తితో ప్రపంచ శాంతి, స్థిరత్వం, శ్రేయస్సు కోసం పనిచేస్తున్నప్పటికీ, ఇతర దేశాలపై ఆధారపడటం దేశ ఆత్మగౌరవానికి, అభివృద్ధికి హానికరమని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా, అమెరికా హెచ్-1బీ వీసా రుసుమును లక్ష డాలర్లకు పెంచిన నేపథ్యంలో మోదీ వ్యాఖ్యలు ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఆత్మనిర్భర భారత్‌ను నిర్మించడం ద్వారా ఈ సవాళ్లను అధిగమించాలని ఆయన పిలుపునిచ్చారు.
అభివృద్ధి కోసం స్వదేశీ దృష్టి..
మోదీ ప్రసంగం ఆత్మనిర్భర భారత్ లక్ష్యాన్ని మరింత బలోపేతం చేసింది. విదేశీ ఆధారితను తగ్గించి, స్వదేశీ ఉత్పత్తి, సాంకేతికత, ఆవిష్కరణలపై దృష్టి పెట్టడం ద్వారా దేశ ఆర్థిక, రాజకీయ స్వాతంత్ర్యాన్ని సాధించవచ్చని ఆయన సూచించారు. గుజరాత్‌లో రూ.34,200 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించడం ద్వారా, స్థానిక అభివృద్ధి, ఉపాధి అవకాశాలను పెంచే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆయన సంకేతం ఇచ్చారు.
కంపెనీలకు భారం..
ఉద్యోగులను తీసుకునే అమెరికన్ కంపెనీలకు వీసా రుసుము ఇప్పుడు భారంగా మారనుంది. గతంలో ఒక ఉద్యోగిపై 6 వేల నుంచి 8 వేల డాలరు‍్ల వెచ్చించేవారు. కానీ ఇప్పుడు పెంచిన ఫీజు చెల్లించడం కంపెనీలకు కష్టంగా మారుతుంది. దీంతో కంపెనీల లాభాలు తగ్గుతాయి. పది మందికి చెల్లించే ఫీజు ఇప్పడు ఒక్కరిపైనే వెచ్చించాలి‍్స ఉంటుంది. అయితే నిపుణులైన వారిని తీసుకోవాల్సి ఉంటే.. ఔట్‌సోర్సింగ్ విధానం పాటించే అవకాశం ఉంది. అయితే ట్రంప్ నిర్ణయంపై దిగ్గజ కంపెనీలు ఏవీ ఇప్పటి వరకు స్పందించలేదు.
మోదీ వ్యాఖ్యలు భారత్‌ను ఆర్థికంగా, వ్యూహాత్మకంగా స్వావలంబనగా మార్చే లక్ష్యాన్ని స్పష్టంగా వెల్లడిస్తున్నాయి. షిప్పింగ్ రంగంలో విదేశీ ఆధారిత ఖర్చులను ఉదాహరణగా చూపడం ద్వారా, ఆయన గత పాలనలోని లోపాలను ఎత్తిచూపారు. అదే సమయంలో, స్వదేశీ ఉత్పత్తిని ప్రోత్సహించడం ద్వారా ఆర్థిక బలోపేతం, ఉపాధి అవకాశాల సృష్టి సాధ్యమని ఆయన నొక్కి చెప్పారు. ఈ సందేశం, అమెరికా వీసా రుసుము పెంపు నేపథ్యంలో, భారతీయ సాంకేతిక నిపుణులు, వ్యాపారవేత్తలు స్వదేశీ సామర్థ్యాలను పెంచుకోవాలని ప్రేరేపిస్తుంది. మొత్తంగా, మోదీ ప్రసంగం ఆత్మనిర్భరతను ఒక ఆర్థిక, సామాజిక, రాజకీయ లక్ష్యంగా మాత్రమే కాక, దేశ ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిపింది. అయితే ఈమేరకు అవకాశాలు కూడా కల్పించాల్సి ఉంటుంది.
Modi : H-1B visa renewal will become easy now
NRIs : Modi, Modi, Modi… ✊
Today Trump imposed $100,000 fee & almost made it impossible
Modi not only sold Jumla to people in India, but also to NRIs abroad
— Veena Jain (@Vtxt21) September 20, 2025