Cyclone Alert In AP: ఆంధ్రప్రదేశ్, ఒడిశా, బెంగాల్ రాష్ట్రాల్లో తుఫాను చెలరేగనుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర తుఫానుగా మారే అవకాశాలున్నాయి. దీంతో శ్రీలంక దానికి అసని అనే పేరుపెట్టింది. ఆగ్నేయ బంగాళాఖాతంలోని తీవ్ర వాయుగుండం బలపడి ఆదివారం నాటికి పెనుతుఫానుగా మారింది. దీంతో రాబోయే మూడు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిసింది. ఈ మేరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
గంటకు 13 కిలోమీటర్ల వేగంతో వాయువ్యంగా పయనిస్తూ తూర్పు మధ్య బంగాళాఖాతంలో ప్రవేశించింది. ఆదివారం రాత్రి నుంచి విశాఖ పట్నానికి ఆగ్నేయంగా 810 కిలోమీటర్లు పూరీకి దక్షిణ ఆగ్నేయంగా 880 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. మంగళవారానికి సాయంత్రం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశిస్తుంది. దీంతో కాకినాడకు ఉత్తర ఈశాన్యంగా దిశ మార్చుకుని పయనిస్తుందని అధికారులు వెల్లడించారు.
Also Read: F3 As Same As F2: ప్చ్.. ‘ఎఫ్ 3’లోనూ ‘ఎఫ్ 2’ వాసనలే !
బంగాళాఖాతంలో ప్రవేశించే క్రమంలో బలహీనపడి 12న వాయుగుండంగా మారుతుంది. తుఫాను ఎప్పుడు ఎలా మారుతుందో తెలియడం లేదు. అందుకే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు పెరగడంతో తుఫాను తీవ్ర తుఫానుగా మారే అవకాశాలున్నాయి. తుఫాను క్రమేపీ బలహీనపడుతుండటంతో ఉపరితలం నుంచి తుఫాను ఐ దిశగా కదులుతుంది.
ఆంధ్రప్రదేశ్ లోని మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం, విశాఖపట్నం, కాకినాడ, గంగవరం పోర్టుల్లో హెచ్చరికలు జారీ చేశారు. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దని సూచిస్తున్నారు. ఈ నెల 9 నుంచి 12 వరకు సముద్రం అలజడిగా ఉంటుందని చెబుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి ఎలాంటి ప్రమాదాలు రాకుండా చూసుకోవాలని అధికారులు పేర్కొన్నారు. మొత్తానికి అసని తుఫాను ప్రజలను మరోసారి ఇబ్బందులకు గురిచేయవచ్చని అధికారులు తెలిపారు.
Also Read: Mehreen Pirzada: ఆ డైరెక్టర్ జీవితంతో ఆడుకుంటున్న హీరోయిన్ !
Recommended Videos:
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
Read MoreWeb Title: High alert for ap severe storm warning
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com