వైద్య నిపుణుల్లో ఎక్కువమంది నిద్రపోయే ముందు నీళ్లు తాగకూడదని చెబుతుంటారు. నిద్రపోయే ముందు నీళ్లు తాగడం వల్ల నిద్రపై ప్రభావం పడే అవకాశం అయితే ఉంటుంది. రాత్రి సమయంలో మూత్రపిండాల పనితీరు నెమ్మదిగా ఉంటుంది కాబట్టి నీళ్లు ఎక్కువగా తాగితే కిడ్నీలపై ఆ ప్రభావం పడుతుంది. ఆహారం తినడానికి 30 నిమిషాల ముందు, ఆహారం తిన్న 30 నిమిషాల తర్వాత కూడా నీళ్లు తాగకూడదు.
నీళ్లు తాగడం వల్ల జీర్ణ వ్యవస్థ పనితీరుపై ప్రభావం పడుతుందని కాబట్టి మంచి నీళ్లు తాగకుండా ఉంటే మంచిదని చెప్పవచ్చు. వ్యాయామం చేసే సమయంలో కూడా మంచి నీళ్లు తాగకూడదు. వ్యాయామం చేసే సమయంలో మంచి నీళ్లు తాగితే శరీర ఉష్ణోగ్రతపై ప్రభావం పడటంతో పాటు తలనొప్పితో పాటు ఇతర ఆరోగ్య సమస్యలు వేధించే అవకాశాలు ఉంటాయి. అందువల్ల వ్యాయామం పూర్తైన కొంత సమయం తర్వాత నీళ్లు తాగితే మంచిది.
భోజనం చేసే సమయంలో నీళ్లు తాగడం వల్ల యాసిడిటీ సమస్యలు కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. భోజనం చేసే సమయంలో నీళ్లు తాగడం వల్ల లాలాజల ఉత్పత్తి నిలిపివేసే అవకాశం ఉండటంతో పాటు శరీరానికి ఆహార పోషకాలు అందే అవకాశాలు తగ్గుతాయి. అయితే యూఎస్ పరిశోధకులు మాత్రం ఆహారం తినే సమయంలో నీళ్లు తాగినా ఎటువంటి ఆరోగ్య సమస్యలు రావని చెబుతున్నారు.