https://oktelugu.com/

Belly Fat: పొట్టచుట్టూ పేరుకుపోయిన కొవ్వు కరగాలంటే ఈ పానీయాలు తాగాల్సిందే!

Belly Fat: ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు పూర్తిగా వారి ఆహార విషయంలో పెద్దఎత్తున మార్పులు చోటు చేసుకున్నారు. ఈ క్రమంలోనే పోషకాలతో కూడిన ఆహార పదార్థాలకు బదులుగా ఎక్కువగా జంక్ ఫుడ్తినడం వల్ల అతి చిన్న వయసులోనే శరీర బరువు పెరగడమే కాకుండా పొట్ట చుట్టూ కొవ్వు ఏర్పడి అనేక రకాల సమస్యల బారిన పడుతున్నారు. ఈ క్రమంలోనే చాలామంది పొట్ట చుట్టూ ఏర్పడిన కొవ్వు తగ్గడం కోసం వివిధ రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. సహజసిద్ధంగా […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 19, 2021 / 12:07 PM IST
    Follow us on

    Belly Fat: ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు పూర్తిగా వారి ఆహార విషయంలో పెద్దఎత్తున మార్పులు చోటు చేసుకున్నారు. ఈ క్రమంలోనే పోషకాలతో కూడిన ఆహార పదార్థాలకు బదులుగా ఎక్కువగా జంక్ ఫుడ్తినడం వల్ల అతి చిన్న వయసులోనే శరీర బరువు పెరగడమే కాకుండా పొట్ట చుట్టూ కొవ్వు ఏర్పడి అనేక రకాల సమస్యల బారిన పడుతున్నారు.

    ఈ క్రమంలోనే చాలామంది పొట్ట చుట్టూ ఏర్పడిన కొవ్వు తగ్గడం కోసం వివిధ రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. సహజసిద్ధంగా పొట్ట చుట్టూ ఏర్పడిన ఈ కొవ్వు తగ్గాలంటే పానీయాలను తాగితే తొందరగా కొవ్వు తగ్గడమే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చు. మరి ఆ పానీయాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం…

    ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం ఒక టేబుల్ స్పూన్ తేనె కలిపి తాగటం వల్ల పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు తొందరగా కరిగిపోతుంది. నిమ్మకాయలు యాంటీ ఆక్సిడెంట్లు ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల ఇది శరీర బరువును తగ్గించడానికి ఇది దోహదపడుతుంది.

    గ్రీన్ టీ శరీర బరువును తగ్గించడమే కాకుండా మన పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వును కరిగించడంలో కీలకపాత్ర పోషిస్తుంది. గ్రీన్ టీలో కాటేచిన్స్ వంటి యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల ఇది కొవ్వును కరిగించడానికి దోహదపడుతుంది.

    జీరా వాటర్..ఇది పొట్ట చుట్టూ ఏర్పడిన కొవ్వును కరిగించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ క్రమంలోనే ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు ఒక టేబుల్ స్పూన్ జీరాను ఒక గ్లాస్ నీటిలో నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం పరగడుపున ఈ నీటిని తాగటం వల్ల కొవ్వు కరగడమే కాకుండా జీర్ణక్రియ వ్యవస్థ కూడా మెరుగుపడుతుంది.

    ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలోకి రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల అలోవెరా జెల్ వేసి రుచి కోసం కాస్త నిమ్మరసం తేనె కలుపుకుని తాగడం వల్ల పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వును తగ్గించుకోవచ్చు.ఇలాంటి సహజ సిద్ధమైన పానీయాలను తాగుతూ తొందరగా శరీర బరువు తగ్గడమే కాకుండా బెల్లీఫ్యాట్ కూడా కరిగించుకోవచ్చు.