Homeఎంటర్టైన్మెంట్Sai Pallavi: అభిమానుల ప్రేమ తట్టుకోలేక స్టేట్​పైనే ఏడ్చేసిన సాయిపల్లవి

Sai Pallavi: అభిమానుల ప్రేమ తట్టుకోలేక స్టేట్​పైనే ఏడ్చేసిన సాయిపల్లవి

Sai Pallavi: విభిన్న చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల మనసు దోచిన హీరో నాని. వరుస సినిమాలు చేస్తూ నాని ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇక నాని ప్రస్తుతం “శ్యామ్ సింగరాయ్” సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే విడుదలైన ట్రైలర్​కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమాలో నాని డ్యుయల్ రోల్ చేసినట్లు తెలుస్తోంది. కాగా, ఇందులో నానికి జోడీగా సాయిపల్లవితో పాటు కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్​లు నటించారు.  రాహుల్ సాంకృత్యాన్​ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై నాని భారీ అశలు పెట్టుకున్నాడు. ఇటీవలే ఓటీటీలో మాత్రమే ప్రేక్షకులను పలకరించిన నాని.. చాలా రోజుల తర్వాత థియేటర్​లో సందడి చేసేందుకు సిద్ధమయ్యారు.

sai-pallavi-crying-to-radhe-shyam-singa-roy-pre-release-event

కాగా, తాజాగా హైదరాబాద్​లో జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్​ ఈవెంట్​లో హీరోయన్ సాయిపల్లవి మాట్లాడుతూ కంటనీరు పెట్టుకుంది.. ప్రస్తుతం ఈ సీన్ నెట్టింట వైరల్​గా మారింది. ఈ సినిమా దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్​ గురించి సాయి పల్లవి మాట్లాడుతుండగా.. ఫ్యాన్స్​ ఒక్కసారిగా అరవడం మొదలుపెట్టారు. దీంతో.. అభిమానుల ప్రేమను తట్టుకోలేని సాయిపల్లవి ఎమోషన్ అవుతూ స్టేజ్​పైనే ఏడ్టేసింది.

ఒక హీరోయిన్​ పేరు వినగానే.. ఫ్యాన్స్ ఇంతలా అరవడం చాలా అరుదని అందరూ అంటున్నారు. దీన్ని బట్టి తెలుస్తోంది సాయిపల్లవికి తెలుగు ప్రేక్షకుల్లో క్రేజ్​ ఏంటో.. కాగా, ఈ సినిమాలో సాయిపల్లవి దేవదాసిగా కనిపించనుంది. క్రిస్మస్​ కానుకగా డిసెంబరు 24న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Exit mobile version