ఇమ్యూనిటీ పవర్ ను తగ్గించే ఆహార పదార్థాలు ఇవే..?

దేశంలో కరోనా మహమ్మారి కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. అయితే కరోనా కేసులు తగ్గినంత మాత్రాన అజాగ్రత్తగా వ్యవహరించకూడదు. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో ఈ కాలంలో వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశంతో పాటు ఇమ్యూనిటీ పవర్ ఉంటే మాత్రమే త్వరగా వైరస్ నుంచి కోలుకునే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. ఇమ్యూనిటీ పవర్ ఎక్కువగా ఉంటే అంటువ్యాధులను ధీటుగా ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. అయితే కొన్ని ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ పవర్ పెరిగే అవకాశాల […]

Written By: Navya, Updated On : June 12, 2021 8:43 pm
Follow us on

దేశంలో కరోనా మహమ్మారి కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. అయితే కరోనా కేసులు తగ్గినంత మాత్రాన అజాగ్రత్తగా వ్యవహరించకూడదు. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో ఈ కాలంలో వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశంతో పాటు ఇమ్యూనిటీ పవర్ ఉంటే మాత్రమే త్వరగా వైరస్ నుంచి కోలుకునే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. ఇమ్యూనిటీ పవర్ ఎక్కువగా ఉంటే అంటువ్యాధులను ధీటుగా ఎదుర్కొనే అవకాశం ఉంటుంది.

అయితే కొన్ని ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ పవర్ పెరిగే అవకాశాల కంటే తగ్గే అవకాశాలు ఉంటాయి. ప్రతీరోజూ తాగే కాఫీలో షుగర్ కంటెంట్ ఎక్కువైతే శరీరంపై ఆ ప్రభావం పడుతుంది. కాఫీలో ఎక్కువగా షుగర్ ఉండటం వల్ల శరీరంలో తాపజనక ప్రోటీన్లు వృద్ది చెంది రోగనిరోధక శక్తిని ప్రభావితం చేస్తాయి. చిప్స్, బేకరీ ఐటమ్స్, డిసర్ట్స్ లో ఉప్పు ఎక్కువగా ఉంటుంది.

ఈ ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల ఆటో ఇమ్యూన్ వ్యాధులు సోకే ప్రమాదం ఉండటంతో పాటు రోగనిరోధక వ్యవస్థ సాధారణ పనితీరు దెబ్బ తినే అవకాశాలు అయితే ఉంటాయి. అందువల్ల ఆహారంలో పరిమితంగా ఉప్పును తీసుకోవడం మంచిది. వేయించిన ఆహారంలో అణువులు ఎక్కువగా ఉంటాయనే సంగతి తెలిసిందే. ఫ్రైడ్ ఫుడ్ రోగనిరోధక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది.

ఫ్రెంచ్ ఫ్రైస్, బంగాళాదుంప చిప్స్, ఫ్రైడ్ చికెన్, ఫ్రైడ్ ఫిష్ కు వీలైనంత దూరంగా ఉంటే మంచిది. కెఫిన్‌ను ఎక్కువగా తీసుకోవడం వల్ల నిద్ర, రోగనిరోధకశక్తిపై ప్రభావం పడే అవకాశాలు అయితే ఉంటాయి. పరిమిత మోతాదులో కాఫీని తాగితే మంచిది. తరచుగా మద్యం సేవించడం వల్ల కూడా ఇమ్యూనిటీ పవర్ తగ్గే అవకాశాలు ఉంటాయి.