Diabetes: అరగంటలో సులువుగా చక్కెర స్థాయిలను తగ్గించుకోవచ్చు.. ఎలా అంటే?

Diabetes:  ప్రపంచ దేశాల ప్రజలలో ఎక్కువమందిని వేధిస్తున్న ఆరోగ్య సమస్యలలో మధుమేహం ఒకటనే సంగతి తెలిసిందే. మధుమేహం బారిన పడిన వాళ్లను ఇతర ఆరోగ్య సమస్యలు కూడా వేధించే అవకాశాలు కూడా ఉంటాయని చెప్పవచ్చు. అయితే మధుమేహంను పూర్తిస్థాయిలో తగ్గించే మందులు మాత్రం లేవు. అయితే శాస్త్రవేత్తలు పాముకాటుకు వినియోగించే ఒక మొక్కతో చక్కెర స్థాయిలను తగ్గించవచ్చని గుర్తించారు. జిమ్నెమా సిల్వెస్ట్రే పేరుతో పిలవబడే ఈ మొక్క రక్తంలోని షుగర్ లెవెల్స్ ను తగ్గిస్తుందని ఒక పరిశోధనలో […]

Written By: Navya, Updated On : January 15, 2022 10:32 am
Follow us on

Diabetes:  ప్రపంచ దేశాల ప్రజలలో ఎక్కువమందిని వేధిస్తున్న ఆరోగ్య సమస్యలలో మధుమేహం ఒకటనే సంగతి తెలిసిందే. మధుమేహం బారిన పడిన వాళ్లను ఇతర ఆరోగ్య సమస్యలు కూడా వేధించే అవకాశాలు కూడా ఉంటాయని చెప్పవచ్చు. అయితే మధుమేహంను పూర్తిస్థాయిలో తగ్గించే మందులు మాత్రం లేవు. అయితే శాస్త్రవేత్తలు పాముకాటుకు వినియోగించే ఒక మొక్కతో చక్కెర స్థాయిలను తగ్గించవచ్చని గుర్తించారు.

జిమ్నెమా సిల్వెస్ట్రే పేరుతో పిలవబడే ఈ మొక్క రక్తంలోని షుగర్ లెవెల్స్ ను తగ్గిస్తుందని ఒక పరిశోధనలో వెల్లడైంది. 20 నెలల పాటు ఈ మొక్క యొక్క ఆకుల సారాన్ని తీసుకున్న వాళ్లలో ఏకంగా 29 శాతం బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గాయని సమాచారం. జిమ్నెమా సిల్వెస్ట్రే తీపిని, ఆకలిని తగ్గించడంతో పాటు బరువు తగ్గడంలో ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. గ్లూకోజ్ ను తగ్గించే సామర్థ్యాన్ని జిమ్నెమా సిల్వెస్ట్రే కలిగి ఉంది.

జిమ్నెమా సిల్వెస్ట్రే యాంటీ డయాబెటిక్ లక్షణాలను కలిగి ఉండటం గమనార్హం. తీగజాతికి చెందిన ఈ మొక్క టార్టారిక్ యాసిడ్, ఫార్మిక్ యాసిడ్, బ్యూట్రిక్ యాసిడ్, ఆంత్రాక్వినోన్ లతో పాటు అల్బుమిన్, క్లోరోఫిల్, కార్బోహైడ్రేట్లు, రెసిన్లను కూడా కలిగి ఉంది. జిమ్నెమా సిల్వెస్ట్రే మొక్కలో ఉండే జిమ్నెమిక్ యాసిడ్ శరీరంలో చక్కెర తినాలనే కోరికను అణచివేయడంలో ఉపయోగపడుతుంది.

మొక్క ఆకుల నుంచి వచ్చే రసాన్ని తీసుకోవడం ద్వారా అధిక కొలెస్ట్రాల్, మధుమేహం, ఊబకాయం సమస్యలకు చెక్ పెట్టడం సాధ్యమవుతుంది. పరిశోధకులు ఈ మొక్కపై మరిన్ని పరిశోధనలు చేస్తున్నారు. భవిష్యత్తులో డయాబెటిస్ ను పూర్తిస్థాయిలో కంట్రోల్ చేసే మందులు అందుబాటులోకి వచ్చే ఛాన్స్ అయితే ఉంది.