
ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పింది. 30 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ముత్తూట్ ఫైనాన్స్ నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. ఈ 30 ఉద్యోగ ఖాళీలను జూనియర్ రిలేషన్ ఎగ్జిక్యూటివ్, ప్రొబేషనరీ ఆఫీసర్ విభాగాల్లో ముత్తూట్ ఫైనాన్స్ భర్తీ చేయనుండటం గమనార్హం. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆన్‌లైన్, టెలిఫోనిక్ ఇంటర్వ్యూల ద్వారా ఈ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. జూన్ 2వ తేదీ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ కాగా ఈ ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులు కృష్ణా జిల్లా విజయవాడలో పని చేయాల్సి ఉంటుంది. https://www.apssdc.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవడం సాధ్యమవుతుంది. జూనియర్ రిలేషన్ ఎగ్జిక్యూటీవ్ విభాగంలో మొత్తం 20 ఖాళీలు ఉన్నాయి.
30 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న పురుషులు ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పాసైన వాళ్లు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు 14వేల రూపాయల వేతనంతో పాటు వెహికిల్ అలవెన్స్ ఉంటుంది. ప్రొబేషనరీ ఆఫీసర్ విభాగంలో 10 ఖాళీలు ఉండగా ఎంబీఏ లేదా ఎంకామ్ చేసిన వాళ్లు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి ఏడాదికి రూ. 2 లక్షల నుంచి రూ. 2.30 లక్షల వరకు జీతం ఉంటుంది. 28 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.