https://oktelugu.com/

Wife and Husband: ఈ అలవాట్లు ఉన్న భర్తలను భార్యలు అస్సలు ఇష్టపడరట.. అవేంటంటే?

Wife and Husband: అబ్బాయిలు అమ్మాయిలను ఆకట్టుకోవడం తేలికైన విషయం కాదనే సంగతి తెలిసిందే. అబ్బాయిలు అమ్మాయిలు ఈ మధ్య కాలంలో పెళ్లికి ముందు, పెళ్లి తర్వాత విడిపోతున్న ఘటనలు ఎక్కువ సంఖ్యలో చోటు చేసుకుంటున్నాయి. భార్యాభర్తల మధ్య ఏర్పడిన చిన్నచిన్న గొడవలు భవిష్యత్తులో పెద్ద గొడవలుగా మారుతున్నాయి. అయితే కొన్ని అలవాట్లు ఉన్న అబ్బాయిలను అమ్మాయిలు అస్సలు ఇష్టపడరు. మహిళలు ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడానికి ఇష్టపడతారనే సంగతి తెలిసిందే. అయితే భర్త ఇంట్లో వస్తువులను ఎక్కడ పడితే […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : March 9, 2022 11:32 am
    Follow us on

    Wife and Husband: అబ్బాయిలు అమ్మాయిలను ఆకట్టుకోవడం తేలికైన విషయం కాదనే సంగతి తెలిసిందే. అబ్బాయిలు అమ్మాయిలు ఈ మధ్య కాలంలో పెళ్లికి ముందు, పెళ్లి తర్వాత విడిపోతున్న ఘటనలు ఎక్కువ సంఖ్యలో చోటు చేసుకుంటున్నాయి. భార్యాభర్తల మధ్య ఏర్పడిన చిన్నచిన్న గొడవలు భవిష్యత్తులో పెద్ద గొడవలుగా మారుతున్నాయి. అయితే కొన్ని అలవాట్లు ఉన్న అబ్బాయిలను అమ్మాయిలు అస్సలు ఇష్టపడరు.

    Wife and Husband

    Wife and Husband

    మహిళలు ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడానికి ఇష్టపడతారనే సంగతి తెలిసిందే. అయితే భర్త ఇంట్లో వస్తువులను ఎక్కడ పడితే అక్కడ ఉంచితే మాత్రం మహిళలకు అస్సలు నచ్చదు. ఈ విషయంలో అబ్బాయిలు అప్రమత్తంగా ఉండకపోతే భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. సోమరితనంతో ఉండే భర్తలు అంటే మహిళలకు అస్సలు నచ్చదు. సోమరితనంతో ఉండే భర్తల వల్ల ఆర్థిక సమయలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

    Wife and Husband

    Wife and Husband

    Also Read: జగన్ ఎన్నికలకు వెళతారా? టీడీపీ అనుమానం?

    భర్త ప్రతిరోజూ ఇంటికి ఆలస్యంగా వస్తే కూడా మహిళలకు అస్సలు నచ్చదు. ఆలస్యంగా ఇంటికి వచ్చే అలవాటు ఉన్న భర్తలు ఆ అలవాటును వెంటనే మార్చుకుంటే మంచిదని చెప్పవచ్చు. తరచూ భర్త ఇంటికి లేట్ గా వస్తే మాత్రం భార్యాభర్తల మధ్య అనుబంధం చెడిపోయే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. ఇంటి బాధ్యతలు మొత్తం భార్యపై ఉంచి ఏ సహాయం చేయకపోయినా భార్యాభర్తల మధ్య గొడవలు తప్పవు.

    భర్త భార్యను ఎల్లప్పుడూ గౌరవించాలి. స్ట్రీని పని చేసే యంత్రంగా భర్త చూడకూడదు. భార్యాభర్తల మధ్య ఏవైనా సమస్యలు వస్తే మాట్లాడుకొని ఆ సమస్యలను పరిష్కరించుకుంటే మంచిదని చెప్పవచ్చు.

    Also Read: ఇన్నేళ్లకు నిరుద్యోగులకు వరం ప్రకటిస్తున్న కేసీఆర్.. ఇకనైనా వ్యతిరేకత పోతుందా?