Chandrababu BJP: ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు వైఖరిలో మార్పు వచ్చినట్లు కనిపిస్తోంది. ఇన్నాళ్లు బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని భావించినా ఇప్పుడు ఆ దిశగా ఆలోచన చేయడం లేదు. దీంతో బీజేపీతో వియ్యానికంటే కయ్యానికే సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఆయన పనులు కూడా అదే సూచిస్తున్నాయి. దేశంలో ప్రధాని నరేంద్ర మోడీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని అందుకే బీజేపీతో పొత్తు లాభం చేకూర్చదని భావిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో జనసేనతో పొత్తు పెట్టుకోవాలని భావించినా పవన్ కల్యాణ్ బీజేపీతో టై అప్ అయి ఉండటంతో ఇక తనకు తలుపులు తీయరనే అభిప్రాయంతోనే బీజేపీతో పొత్తుకు నై అంటున్నారనే ఊహాగానాలు వెలువడుతున్నాయి.
గత ఎన్నికల్లో బీజేపీతో వైరం పెట్టుకుని అధికారానికి దూరం అయ్యారు. ఈ సారి కూడా అలాగే చేస్తే అధికారం చేజిక్కడం కల్లే అని తెలిసినా ఇక వేరే దారి లేకే బీజేపీతో పొత్తుకు వెనకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు టీడీపీని ఎలా గట్టెక్కించాలనే దానిపైనే తర్జనభర్జన పడుతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈనేపథ్యంలో చంద్రబాబుకు ఏ దారి కూడా కానరావడం లేదు. వైసీపీని ఎదుర్కొనేందుకు తన బలం చాలదని తెలియడంతోనే పొత్తులకు సై అంటున్నా ఏ పార్టీ కూడా బాబుతో కలిసేందుకు రెడీగా లేదు.
Also Read: జగన్ ఎన్నికలకు వెళతారా? టీడీపీ అనుమానం?
దక్షిణాది రాష్ట్రాలలో బలమైన పార్టీలతోనే పొత్తుకు బీజేపీ సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఏపీలో వైసీపీ బలమైన పార్టీగా ఉండటంతో దాంతోనే పొత్తు పెట్టుకోవాలని చూస్తున్నా దానికి అది సిద్ధంగా లేనట్లు సంకేతాలు వస్తున్నాయి. జగన్ ఎవరితోనూ కలిసేందుకు సుముఖంగా కనిపించడం లేదు. అందుకే టీడీపీకి బీజేపీ అవకాశం ఇవ్వడం లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. జమిలి ఎన్నికలకు కేంద్రం ప్రయత్నాలు చేస్తుండటంతో పార్లమెంట్, శాసనసభల ఎన్నికలు ఒకేమారు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఏపీ బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగాన్ని టీడీపీ అడ్డుకుంది. గవర్నర్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేసింది. గవర్నర్ ను అడ్డుకుంటే బీజేపీని అడ్డుకున్నట్లే అని చంద్రబాబు సూచనల మేరకే టీడీపీ సభ్యులు గవర్నర్ ప్రసంగంపై విమర్శలు చేసినట్లు సమాచారం. ఈ వ్యవహారం చూస్తుంటే బాబు బీజేపీతో కయ్యానికే రెడీ అయినట్లు చెబుతున్నారు. ఇందులో భాగంగానే టీడీపీ విధానాలు ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. భవిష్యత్ లో బీజేపీతో పోరాటానికే టీడీపీ సిద్ధపడినట్లు సంకేతాలు వస్తున్నాయి. కానీ టీడీపీ బీజేపీతో కాలు దువ్వి ఏ మేరకు ప్రయోజనం సాధిస్తుందో వేచి చూడాలి.
Also Read: ఇన్నేళ్లకు నిరుద్యోగులకు వరం ప్రకటిస్తున్న కేసీఆర్.. ఇకనైనా వ్యతిరేకత పోతుందా?