Homeలైఫ్ స్టైల్Tablet Score Line: మాత్రల మధ్య ఆ గీత ఎందుకు.. డిజైన్ అనుకుంటే పొరబాటే

Tablet Score Line: మాత్రల మధ్య ఆ గీత ఎందుకు.. డిజైన్ అనుకుంటే పొరబాటే

Tablet Score Line: వెనుకటి కాలంలో అంటే రోగాలు అంతగా వచ్చేవి కాదు. ఒకవేళ రోగాలు వచ్చినా సరే చాలామంది నాటు మందులు వాడేవారు. కాలక్రమంలో వైద్య పరిజ్ఞానం పెరిగింది. మొండి రోగాలకు మందులు తయారు చేయడం.. మనిషి సగటు ఆయుష్షును పెంచడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. వైద్య పరిజ్ఞానం అభివృద్ధి చెందిన తర్వాత.. వచ్చే రోగాలు కూడా అలాగే ఉంటున్నాయి..

ఆధునిక జీవనశైలికి మనిషి అలవాటు పడిన తర్వాత రకరకాల వ్యాధులు వస్తున్నాయి. ఈ వ్యాధులను తగ్గించడానికి వైద్యశాస్త్రంలో ప్రయోగాలు జరుగుతున్నాయి. ఆ ప్రయోగాల ఫలితంగా కొత్త కొత్త మందులు అందుబాటులోకి వస్తున్నాయి. ముఖ్యంగా మధుమేహం, రక్తపోటు, మూత్రపిండాల సమస్యలు, మెదడు సమస్యలు ఇటీవలి కాలంలో పరిపాటిగా మారిపోయాయి. శారీరక శ్రమ లేకపోవడం.. బయట తిండి అధికం కావడంతో శరీరంలో ప్రమాదకరమైన ఫ్యాట్ పెరిగిపోతోంది.

ఒత్తిడి వల్ల అనేక రకాల సమస్యలు ఎదురవుతున్నాయి. కొందరు తీవ్రమైన ఒత్తిడి వల్ల అంతర్గత రక్తస్రావం వంటి సమస్యలతో బాధపడుతున్నారు. కొన్నిసార్లు మరణాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. ఈ వ్యాధులను తగ్గించడానికి కొత్త కొత్త మందులు అందుబాటులోకి వస్తున్నాయి. అయితే ఈ మందులు మాత్రమే కాకుండా.. సాధారణ జలుబు, జ్వరానికి వాడే మందుల్లో ముఖ్యంగా మాత్రల్లో మధ్య గీత వస్తోంది. ఎక్కువ మాత్రల మధ్య ఉండే చిన్న గీత చాలామందికి డిజైన్ లాగా అనిపిస్తూ ఉంటుంది. కానీ దీనిని డిజైన్ కోసం రూపొందించరు. దీనిని వైద్య పరిభాషలో స్కోర్ లైన్ అని పిలుస్తుంటారు. మోతాదులో మందు అవసరమైనప్పుడు లేదా డాక్టర్లు సగం మాత్ర మాత్రమే వేసుకోమంటారు. మాత్రను విడగొట్టడానికి అది ఉపయోగపడుతుంది. దీనివల్ల రోగులకు సరైన స్థాయిలో డోస్ అందుతుంది.

అన్ని మాత్రలకు ఇలా గీత ఉండదు. కొన్ని మాత్రలకు మాత్రమే ఉంటుంది. దీనిని బట్టి ఆ మాత్రలు సగం డోస్ అయినా చాలు.. శరీరానికి సరిపోతుందని వైద్యుల నమ్మకం. ఎందుకంటే అతిగా మందులు వాడతాయి శరీరంలో రకరకాల మార్పులు చోటు చేసుకుంటాయి. దీనివల్ల వ్యాధులు తగ్గకపోగా.. కొత్త వ్యాధులు వస్తుంటాయి. అందువల్లే కొన్ని మాత్రలకు స్కోర్ లైన్ వాడుతుంటారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular